చెస్ ప్రపంచకప్: ప్రజ్ఞానందకు ఓటమి, ఛాంపియన్‌గా మాగ్నస్ కార్ల్‌సెన్

అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచకప్ చెస్ టోర్నమెంట్ ఫైనల్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానానంద ఓటమిని చవిచూడగా, మాగ్నస్ కార్ల్‌సెన్ ఛాంపియన్‌గా నిలిచాడు. భారత యువ ఆటగాడు ఆర్ ప్రజ్ఞానానంద తొలి, రెండో మ్యాచ్‌ల్లోనూ డ్రా చేసుకున్నాడు. ఇలా ఈరోజు జరిగిన టై బ్రేకర్‌లో నార్వే ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సెన్ అద్భుత విజయాన్ని నమోదు చేశాడు.

మాగ్నస్ కార్ల్‌సెన్ మొదటి ఛాంపియన్‌గా నిలవగా, ప్రజ్ఞానంద రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. కార్ల్‌సన్‌ తొలి టై బ్రేకర్‌ను గెలిచి 1-0తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఆ తర్వాత రెండో మ్యాచ్ డ్రా అయింది. దీంతో కార్ల్‌సన్‌ తొలి ప్రపంచకప్‌ చాంపియన్‌గా నిలిచాడు. ఛాంపియన్‌గా నిలిచిన కార్ల్‌సన్‌కు దాదాపు 90,93,551 లక్షల రూపాయల ప్రైజ్ మనీ లభిస్తుంది. సెకండ్ రన్నరప్ ప్రజ్ఞానందకు రూ.66,13,444 నగదు బహుమతి లభిస్తుంది. ఫాబియానో ​​కరువానా మూడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.