తెలంగాణ సచివాలయ ప్రాంగణంలో దేవాలయం, మసీదు, చర్చి ప్రారంభోత్సవం

తెలంగాణ నూతన సచివాలయ ఆవరణలో నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని శుక్రవారం ప్రారంభించారు.తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మూడు చోట్ల ప్రత్యేక పూజలు, ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.ఏఐఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ లోక్‌సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, ఆయన తమ్ముడు, అసెంబ్లీలో ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ మసీదు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు.మసీదు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తెలంగాణలో సోదరభావాన్ని కొనసాగించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి […]