Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

నిధి అగర్వాల్ ‘రాజాసాబ్’పై ఆసక్తికర వ్యాఖ్యలు

‘రాజాసాబ్’లో నా పాత్రను ఊహించలేరు.. ప్రేక్షకుల అభిప్రాయాన్ని మార్చుతుందన్న నిధి అగర్వాల్

టాలీవుడ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోలతో పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’, అలాగే ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ చిత్రంలో నటిస్తున్న నిధి, ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నిధి, తన పాత్ర గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “ప్రేక్షకులు నా నుంచి గ్లామర్ పాత్రలను మాత్రమే ఆశిస్తారని భావిస్తారు. అయితే ‘రాజాసాబ్’లో నా పాత్ర ఆ అభిప్రాయాన్ని పూర్తిగా మార్చేస్తుందని నమ్మకంగా చెప్పగలను. ఈ పాత్ర రెగ్యులర్ హాట్ పాత్రలకు భిన్నంగా ఉంటుంది. ఇది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ చిత్రంలో నా పాత్రను ఎవ్వరూ ఊహించలేరు,” అంటూ చెప్పుకొచ్చింది.

‘రాజాసాబ్’పై అంచనాలు

‘రాజాసాబ్’ చిత్రాన్ని మారుతి దర్శకత్వంలో రూపొందించారు. ప్రభాస్ తొలిసారిగా హారర్ నేపథ్యంతో కూడిన కథలో నటిస్తుండటంతో ఈ సినిమా ప్రత్యేక ఆకర్షణగా మారింది. మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధికుమార్, సంజయ్ దత్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ చిత్రం ఈ వేసవిలో విడుదలకు సిద్ధమైంది.

సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, “ఇది మాస్ ఆల్బమ్. విభిన్నమైన పాటలు ఈ సినిమాలో ఉన్నాయి. ఈ చిత్రం ఇండియన్ సినిమాను మరో స్థాయికి తీసుకెళ్తుంది” అని పేర్కొన్నాడు.

ప్రేక్షకులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘రాజాసాబ్’ ఏప్రిల్ 10న థియేటర్లలో సందడి చేయనుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *