విశాల్ మెగామార్ట్ మరియు మొబిక్విక్ ఐపీఓలతో స్టాక్ మార్కెట్‌లో భారీ లాభాలు

విశాల్ మెగామార్ట్ మరియు మొబిక్విక్ ఐపీఓలు ఈరోజు స్టాక్ మార్కెట్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాయి. ఈ రెండు కంపెనీల షేర్లు తొలి రోజే అత్యధిక ప్రీమియంతో లిస్ట్ అయ్యాయి, దాంతో ఇన్వెస్టర్లకు భారీ లాభాలు దక్కాయి.

విశాల్ మెగామార్ట్, దేశవ్యాప్తంగా సూపర్‌మార్కెట్లను నిర్వహిస్తున్న ప్రముఖ సంస్థ, ఈరోజు తన తొలి పబ్లిక్ ఇష్యూను స్టాక్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇష్యూని రూ.78తో ప్రారంభించిన ఈ షేరు 33.33% ప్రీమియంతో రూ.104 వద్ద ఎన్‌ఎస్‌ఈలో లిస్ట్ అయ్యింది. దీని ద్వారా ఇన్వెస్టర్లు ఒక్కో షేరుపై రూ.26 లాభం పొందారు. ఈ ఐపీఓ ద్వారా 8,000 కోట్ల రూపాయల నిధులను సమీకరించడానికి విశాల్ మెగామార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి రోజు నుంచే ఈ ఐపీఓకు మంచి స్పందన వచ్చింది, చివరి రోజు 28 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది.

అంతే కాకుండా, మొబిక్విక్ ఐపీఓ కూడా 58.51% ప్రీమియంతో రూ.442.25 వద్ద లిస్ట్ అయింది. కంపెనీ షేర్లు రూ.279 తో ప్రారంభమై, తొలిరోజే ఇన్వెస్టర్లకు 60% లాభాలను అందించాయి. ఈ ఐపీఓకి కూడా ప్రారంభం నుండి భారీ స్పందన లభించి, చివరిరోజు 119 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్ అయ్యింది. 572 కోట్లు సమీకరించడానికి వచ్చిన ఈ ఐపీఓ ఇన్వెస్టర్ల ఆశల్ని అధిగమించింది.

ఈ రెండు ఐపీఓల లిస్టింగ్ మార్కెట్ లో మంచి లాభాలను తెచ్చాయి. మొబిక్విక్ ఐపీఓ ఇన్వెస్టర్లకు 58.5% లాభాలు, విశాల్ మెగామార్ట్ 33% లాభాలను ఇచ్చాయి. ఇలాంటి ఐపీఓలతో మార్కెట్‌లో మంచి రాబడులు సాధించాలనే ఆశతో మదుపరులు ముందుకు వెళ్ళిపోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు