Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

సూర్యాపేటలో రోడ్డు ప్రమాదం: ఖమ్మం-కోడాడ జాతీయ రహదారిపై ఇద్దరు మృతి

సూర్యాపేట: తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో ఖమ్మం-కోడాడ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ఇన్నోవా కారు, లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇన్నోవాలోని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.