
హైదరాబాద్‌లో బాలీవుడ్ నటిపై దాడి: రూ.50 వేలు, బంగారం దోపిడీ
హైదరాబాద్: బాలీవుడ్ నటిపై హైదరాబాద్‌లోని మాసాబ్‌ట్యాంక్ ప్రాంతంలో దుండగులు దాడి చేశారు. ఈ ఘటనలో నటి నుంచి రూ.50 వేల నగదు, బంగారు ఆభరణాలను దోచుకుని గ్యాంగ్ పరారైంది. ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కాగా, దాడిలో అత్యాచార యత్నం కూడా జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.