Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

ఘోర అగ్నిప్రమాదం: ఏలూరులో 20 గుడిసెలు దగ్ధం, ఆరుగురికి గాయాలు

ఏలూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో నివాసం ఉంటున్న పక్షుల వేటగాళ్లకు చెందిన కుటుంబాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.