పీవీ సింధు వివాహ రిసెప్షన్‌: ప్రముఖులు హాజరుకానున్నారు

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు, వెంకటదత్త సాయి వివాహ వేడుకలో భాగంగా ఈ రోజు (మంగళవారం) మరో ముఖ్యమైన కార్యక్రమం నగరంలో జరగనుంది. ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌ వేదికగా రిసెప్షన్‌ జరుగుతుంది. ఈ కార్యక్రమానికి పలువురు క్రీడా, సినిమా, రాజకీయ రంగ ప్రముఖులు హాజరుకానున్నారు.