సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ దర్శకుడు సుకుమార్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సందర్శించిన సుకుమార్, బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాలుడి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ ముందు సుకుమార్ భార్య తబిత శ్రీతేజ్ కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెంది, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, అల్లు అర్జున్‌తో పాటు సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని అరెస్టు చేశారు.