రష్మిక మందన్న: ‘ఛావా’లో మహారాణి యేసుబాయి పాత్రతో కొత్త ఛాలెంజ్

ప్రముఖ కథానాయిక రష్మిక మందన్న ప్రస్తుతం భారతీయ సినిమా పరిశ్రమలో అగ్రనామంగా వెలుగొందుతోంది. తెలుగులో ‘పుష్ప’ సిరీస్‌తో సూపర్ హిట్స్ సాధించిన ఆమె, ఇప్పుడు బాలీవుడ్‌, కోలీవుడ్ వంటి ఇతర భాషలలోనూ ఆకట్టుకుంటోంది. తాజాగా, రష్మిక బాలీవుడ్‌ హీరో విక్కీ కౌశల్‌ తో కలిసి నటిస్తున్న చారిత్రక చిత్రం ‘ఛావా’లో ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఛావా’ చిత్రం శంభాజీ మహారాజ్‌ జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్నది. విక్కీ కౌశల్‌ శంభాజీ పాత్రలో కనిపిస్తే, రష్మిక మహారాణి యేసుబాయి పాత్రలో నటిస్తున్నారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను చిత్రబృందం ఇటీవల విడుదల చేసింది. ‘ప్రతి గొప్ప రాజు వెనక ఒక శక్తివంతమైన మహారాణి ఉంటుంది’ అనే క్యాప్షన్‌తో రష్మిక తన పాత్రను ప్రదర్శించారు. ఆమె నతించిన పోస్టర్‌లో సంప్రదాయ మరాఠీ దుస్తులు, బంగారు ఆభరణాలతో రాజసంస్కృతిలో కనిపిస్తోంది.

రష్మికకు ఇది ఒక కొత్త ఛాలెంజ్ అని భావిస్తున్నారు. గతంలో కమర్షియల్‌ చిత్రాలలో అద్భుతంగా నటించిన రష్మిక, ఈ పాత్రలో కూడా తన ప్రతిభను చూపిస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ చిత్రాన్ని దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్‌ డైరెక్ట్ చేస్తున్నట్లు సమాచారం.

ఈ చిత్రానికి సంగీతం: ఏ.ఆర్‌. రెహమాన్‌. ఇదిలా ఉంటే, రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’, ‘సికందర్’, ‘కుబేర’, ‘తామా’ వంటి మరిన్ని ప్రాజెక్టులలో కూడా నటిస్తున్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు