పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో డిసెంబర్ 15న జరిగిన ఒక కార్యక్రమంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకుడు నారాయణ మూర్తి తన 70 గంటల పనిగంటల వ్యాఖ్యలపై మరోసారి స్పందించారు. దేశంలోని యువత అత్యధికంగా శ్రమిస్తేనే పేదరికాన్ని అధిగమించగలమని అన్నారు. “మన దేశంలో 80 కోట్ల మంది ఉచిత రేషన్‌పై ఆధారపడి జీవిస్తున్నారు. అంటే ఈ స్థితిలో మన దేశం అభివృద్ధి చెందిన దేశాల సరసన చేరాలంటే అందరి శ్రమ అవసరం,” అని స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ నారాయణ మూర్తి, ఇన్ఫోసిస్ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంస్థలతో పోటీ పడేందుకు భారతీయుల కఠినశ్రమ అవసరమని వివరించారు. దేశ పేదరికాన్ని క్షీణించించడంలో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని, వారానికి కనీసం 70 గంటల పాటు పనిచేయాలని పిలుపునిచ్చారు.
అభివృద్ధి చెందిన దేశాల నుంచి ప్రేరణ పొందిన అనుభవాలను పంచుకుంటూ, “రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్, జర్మనీ దేశాలు ఎలా కష్టపడి అభివృద్ధి చెందాయో మనం కూడా అలానే పని చేయాలి. ఈ మార్గంలోనే పేదరికాన్ని తగ్గించగలము. శ్రమ మాత్రమే గౌరవాన్ని తెస్తుంది, గౌరవం అధికారం తెస్తుంది,” అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
గతంలో నారాయణ మూర్తి చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీసినప్పటికీ, ఇప్పుడు మరోసారి తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం. “ప్రభుత్వాలు మాత్రమే కాదు, వ్యాపారవేత్తలు, ఉద్యోగులు, మరియు ప్రతి ఒక్కరూ కలిసి దేశ అభివృద్ధికి బాధ్యత తీసుకోవాలి,” అని ఆయన అభిప్రాయపడ్డారు.