భారత్-పాక్ ఛాంపియన్స్ ట్రోఫీ వివాదం: జెర్సీలపై దేశ పేరుతో వివాదం చెలరేగింది

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ప్రారంభానికి సమయం ఆసన్నమవుతుండగా, భారత్-పాక్ క్రికెట్ బోర్డుల మధ్య మరో వివాదం తెరపైకి వచ్చింది. పాకిస్తాన్ ఆతిథ్య దేశంగా ఉండటంతో, టీమిండియా జెర్సీలపై పాకిస్తాన్ పేరు ముద్రించడం భారత బోర్డు (బీసీసీఐ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ విషయంపై బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఫిర్యాదు చేసింది.

భారత జట్టులో పాకిస్తాన్ పేరును ముద్రించటాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని స్పష్టం చేసిన బీసీసీఐ, ఈ నిర్ణయంపై పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో తీవ్ర విభేదంలో పడింది. ఐసీసీ రెండు బోర్డుల మధ్య వివాదం పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, పరిష్కారం దొరకడం కష్టంగా కనిపిస్తోంది.

ఈ వివాదం నడుమ బీసీసీఐ కొత్తగా ఒక ప్రకటన విడుదల చేసింది. భారత్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పాకిస్తాన్‌లో జరగనున్న ఫోటోషూట్, ప్రెస్ కాన్ఫరెన్సులకు హాజరుకాబోరని స్పష్టం చేసింది. ఇవి వేరే వేదికకు మార్చాలని ఐసీసీని కోరింది.

ఈ పరిణామాలు ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధతలు పెంచాయి. టోర్నీ జరిగే ప్రతీసారి ఆతిథ్య దేశం పేరును జెర్సీలపై ముద్రించడం ఆనవాయితీ అయినప్పటికీ, ఈసారి భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.

ఒకవేళ భారత బోర్డు పెట్టిన షరతులను పీసీబీ అంగీకరించకపోతే, భారత్ టోర్నీకి హాజరు కాలేదన్న ఊహాగానాలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ వివాదం కారణంగా క్రికెట్ అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు