గూగుల్ “ఇయర్ ఇన్ సెర్చ్ 2024” లో వినేశ్ ఫొగాట్ అగ్రస్థానం – పవన్ కళ్యాణ్ 5వ స్థానంలో

2024లో భారతీయులు గూగుల్ లో ఎక్కువగా వెతికిన వ్యక్తుల జాబితాలో ప్రముఖ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ అగ్రస్థానంలో నిలిచారు. రాజకీయ రంగంలో ప్రవేశించి, వివాదాస్పదంగా మారిన ఈ రెజ్లర్ ఈ ఏడాది గూగుల్ సెర్చ్ లో అగ్రస్థానం సాధించింది. బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా ఆమె చేస్తున్న పోరాటం, పారిస్ ఒలింపిక్స్‌లో ఆమె సవాళ్లు, అలాగే కాంగ్రెస్ పార్టీని చేరి జరిగిన ఎన్నికల్లో విజయం సాధించడం ఈ ఏడాది ఆమె గురించి ఎక్కువ మంది వెతికేందుకు కారణాలయ్యాయి.

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ రెండో స్థానంలో నిలిచారు. ఆ పార్టీ జేడీయూ, ఎన్డీఏ కూటమిలో కీలక పాత్ర పోషించిన నితీశ్ కుమార్, ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో 12 స్థానాలు సాధించి రాజకీయంగా మరింత చురుకైన పాత్రలో ఉన్నారు.

ఈ జాబితాలో నాలుగో స్థానంలో టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, ఐదో స్థానంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి గా ఉన్నప్పటికీ, ఆయన రాజకీయాలు, సినిమాలు, మరియు పలు ఇతర విషయాలతో పాటు ప్రజలలో విశేషమైన చర్చకు పునాది రాయి ఏర్పడింది. 6వ స్థానంలో క్రికెటర్ శశాంక్ సింగ్, 7వ స్థానంలో మోడల్ పూనం పాండే, 8వ స్థానంలో వ్యాపారవేత్త రాధిక మర్చంట్, 9వ స్థానంలో క్రికెటర్ అభిషేక్ శర్మ, 10వ స్థానంలో బ్యాడ్మింటన్ ఆటగాడు లక్ష్య సేన్ ఉన్నారు.

గూగుల్ ఈ “ఇయర్ ఇన్ సెర్చ్ 2024” రిపోర్టును విడుదల చేసిన తరువాత, ఇండియన్ ప్రజలు ఎక్కువగా సెర్చ్ చేసిన ఇతర ప్రముఖ విషయాలు కూడా వెలుగులోకి వచ్చాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు