ప్రధాని మోదీ ప్రసంగం సందర్భంగా ఓ యువతి హైడ్రామా

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రధాని దృష్టిని ఆకర్షించేందుకు ఓ యువతి లైట్ టవర్ ఎక్కింది. దీంతో ఒక్కసారిగా జనాల్లో భయాందోళన నెలకొంది. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో హైడ్రామా చోటుచేసుకుంది. ప్రధాని దృష్టిని ఆకర్షించేందుకు ఓ యువతి లైట్ టవర్ ఎక్కింది. దీంతో ఒక్కసారిగా జనాల్లో భయాందోళన నెలకొంది.

ప్రధానితో మాట్లాడేందుకు ఆ యువతి గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన లైట్ టవర్ పైకి ఎక్కింది. ఈ దృశ్యాన్ని చూసిన వెంటనే.. ప్రాణాలకు ముప్పు ఉందని.. ఆ యువతి కిందికి రావాలని ప్రధాని మోదీ పదే పదే అభ్యర్థించారు. ఇది సరికాదు, మేము మీతో ఉన్నాము. దయచేసి కిందకు రండి, నేను మీ మాట వింటాను. అక్కడే షార్ట్ సర్క్యూట్ అవుతుంది, దయచేసి కిందకు దిగండి.. అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి, నేను మీ కోసం ఇక్కడ ఉన్నాను. అని యువతితో ప్రధాని మోదీ అన్నారు. ఆ తర్వాత ఆ యువతి టవర్ పై నుంచి కిందకు వచ్చింది.