ఏపీలో జాతీయ రహదారి విస్తరణ: రూ.5,417 కోట్లతో నాలుగు లైన్లపై అభివృద్ధి

ఆంధ్రప్రదేశ్‌లో నేషనల్ హైవే 544డిలో విస్తరణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మొత్తం 219.80 కిలోమీటర్ల రహదారిని నాలుగు లైన్లుగా పెంచేందుకు రూ.5,417 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ విస్తరణలో 21 చోట్ల బైపాస్‌లు కూడా నిర్మించేందుకు అనుమతి లభించింది.

ఈ విస్తరణ పనులు అనంతపురం నుండి గుంటూరు వరకు జరగనున్నాయి. ఇందులో బుగ్గ-గిద్దలూరు మధ్య 135 కిలోమీటర్లు, వినుకొండ-గుంటూరు మధ్య 84.80 కిలోమీటర్ల రోడ్డు విస్తరించబడతాయి. ఈ విస్తరణ పనులు ఇప్పటికే ప్రారంభమైన బుగ్గ-అనంతపురం రహదారి మీద కొనసాగుతాయి. గిద్దలూరు-వినుకొండ రహదారి, ఈ విస్తరణలో ఉన్న 135 కిలోమీటర్ల లో 25 కిలోమీటర్లు నల్లమల అటవీ ప్రాంతం మీదుగా వెళ్ళనున్నాయి. అయితే అటవీ ప్రాంతంలో మూడు రకమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ విస్తరణతో, హైదరాబాద్ మరియు బెంగళూరుతో మరింత సమీపమైన రాకపోకలతో పాటు, రోడ్డు ప్రయాణం సులభతరం అవుతుంది. ఈ ప్రాజెక్టు త్వరలో పూర్తి కావడంతో, రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్కరణకు కీలకమైన అడుగులు పడతాయని అధికారులు పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు