హైదరాబాద్‌హోటల్ కిచెన్స్‌లో దారుణాలు : ఆహార భద్రత అధికారుల తనిఖీల్లో సంచలనాలు

హైదరాబాద్ నగరంలో ఆహార భద్రత అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు సంచలనాలకారకంగా మారాయి. డిసెంబర్ 11న మాదాపూర్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో పలు ప్రసిద్ధ రెస్టారెంట్లు, స్వీట్ షాపుల్లో తనిఖీలు జరిగాయి. బెజవాడ భోజనం, మాదాపూర్ ఆరంభం (మిల్లెట్ ఎక్స్‌ప్రెస్ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్) వంటి ప్రసిద్ధ రెస్టారెంట్లలో ఆహార భద్రత నిబంధనలను తీవ్రమైనగా ఉల్లంఘించారని అధికారులు వెల్లడించారు.

తాజాగా జూబ్లీహిల్స్‌లోని ప్రఖ్యాత హార్ట్‌కప్‌ కాఫీ రెస్టారెంట్‌ అండ్‌ బార్‌లో చేసిన తనిఖీల్లో వంటగదిలో బొద్దింకలు అధికంగా ఉండటం, గడువు ముగిసిన పదార్థాలు వాడటం, సరైన లేబులింగ్ లేకుండా పదార్థాలను నిల్వ చేయడం వంటి నిబంధనల ఉల్లంఘనలు గుర్తించారు. ఆరంభం రెస్టారెంట్‌లో లేబులింగ్ తప్పుల కారణంగా రూ. 21,893 విలువైన ఆహార పదార్థాలను సీజ్ చేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఫుడ్ సేఫ్టీ అధికారులు పేర్కొన్న మరో ముఖ్య విషయం ఏమిటంటే, ఈ హోటల్స్ లో వాడే నూనెలు, కూరగాయలు, మాంసం పదార్థాలు అధికంగా కలుషితం అయ్యి ఉండటం. రాత్రి వేళల్లో ఆర్డర్లకు సిద్ధంగా ఉంచిన ఫుడ్‌లో కలుషితమైన పదార్థాలు, ఫుడ్ కలర్స్, కెమికల్స్ వాడటం వంటి అంశాలు బయటపడ్డాయి. ప్రజల ఆరోగ్యానికి పెద్ద ముప్పుగా నిలుస్తున్న ఈ అంశాలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది.

ఈ తనిఖీల అనంతరం అధికారుల సూచన ప్రకారం పౌరులు హోటల్ ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కేవలం “ఒక్కసారే” అనే భావనతో బయట ఆహారం తీసుకోవడం వల్ల తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదురుకావచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు