హైదరాబాద్ నగరంలో హైడ్రా సంస్థ చేపట్టిన అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. జులై 2024కి ముందు నిర్మితమైన నివాస గృహాలపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని స్పష్టం చేసిన ఆయన, ఎఫ్‌టీఎల్ (ఫుల్ ట్యాంక్ లెవెల్) పరిధిలోని వాణిజ్య కట్టడాలను మాత్రం కూల్చడం జరుగుతుందని తెలిపారు. అనుమతులేమీ లేకుండా నిర్మించిన వ్యాపార కట్టడాలు, ఫార్మ్‌హౌసులు, రిసార్ట్‌లు ఈ కేటగిరీలోకి వస్తాయని వివరించారు.
రంగనాథ్ ప్రకటన ప్రకారం, హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి పొందిన కట్టడాలపై ఎలాంటి చర్యలు ఉండవని, అయితే అనుమతులు రద్దు అయిన కట్టడాలు అక్రమ కట్టడాలుగా పరిగణించబడతాయని వెల్లడించారు. గత ఐదు నెలల్లో హైడ్రా దాదాపు 12 చెరువులలో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. చెరువుల పునరుద్ధరణ కోసం ప్రతిపాదనలు ప్రభుత్వం పరిశీలన