రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు

భారత సీనియర్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టు ముగిసిన అనంతరం అశ్విన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ ప్రకటనతో క్రికెట్ ప్రపంచం షాక్‌కు గురైంది. అశ్విన్ తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించే సమయంలో అతడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. ముఖ్యంగా డ్రెస్సింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీతో చేసిన సన్నిహిత సంభాషణ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

అశ్విన్ మాట్లాడుతూ, “భారత క్రికెటర్‌గా ఇదే నా చివరి రోజు. అన్ని ఫార్మాట్ల నుంచి వీడ్కోలు చెబుతున్నా. క్లబ్ క్రికెట్‌లో కొనసాగుతాను, కానీ అంతర్జాతీయ క్రికెట్‌కు ఇక మరో అడుగు వేయడం లేదు” అని పేర్కొన్నాడు. 106 టెస్టులు, 116 వన్డేలు, 65 టీ20లు ఆడిన అశ్విన్, 4,400 పరుగులు సాధించిన విషయం తెలిసిందే. అతని వికెట్ల సంఖ్య మొత్తం 765. బీసీసీఐ అశ్విన్ సేవలను కొనియాడుతూ, అతని కెరీర్‌ను అత్యంత విలక్షణంగా ప్రశంసించింది.

అశ్విన్ ఈ నిర్ణయం తీసుకున్న సందర్భంలో కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వంటి సహచరులు అతన్ని గౌరవించగలిగారు. “అశ్విన్ భారత క్రికెట్‌ను అనేక విజయాలకు నడిపించాడు. అతని సేవలు మరచిపోలేము” అని రోహిత్ శర్మ అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు