గురువారం తెల్లవారుజామున కొండాపూర్‌లోని కౌశిక్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. అరెస్టు వార్తలు తెలిసిన వెంటనే బీఆర్ఎస్ కీలక నేతలు హరిష్ రావు, జగదీష్ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డిని అరెస్ట్‌ను అడ్డుకోవడానికి హరిష్ రావు ప్రయత్నించగా, పోలీసులు అతనిని కూడా అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు హరిష్ రావును గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌కు తరలించగా, కౌశిక్ రెడ్డిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ ఘటనలతో కౌశిక్ రెడ్డి నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్ కార్యకర్తలు గేట్లు దూకి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసుల ఫిర్యాదుల మేరకు మరికొందరు నేతలపై కూడా కేసులు నమోదయ్యాయి.
ఈ ఘటనపై స్పందించిన బీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. “ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నా పరిస్థితి చూస్తున్నాం,” అంటూ హరిష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.
దీంతో తెలంగాణ రాజకీయాలు మరింత వేడెక్కగా, బీఆర్ఎస్ పార్టీ నేతలు అరెస్టులకు వ్యతిరేకంగా ఆందోళనలు ప్రారంభించారు.