హెచ్‌సీఎల్‌ టెక్‌ హైదరాబాద్‌లో కొత్త సెంటర్‌ ప్రారంభం

3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆధునిక సదుపాయాలు, 5,000 ఉద్యోగాలు

హైదరాబాద్‌: దేశీయ ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ నగరంలో తన కార్యకలాపాలను విస్తరించింది. 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన కొత్త సెంటర్‌ హైటెక్‌ సిటీలో ప్రారంభమైంది. ఈ సెంటర్‌ ద్వారా లైఫ్‌ సైన్సెస్‌, ఆర్థిక సేవలు, క్లౌడ్‌, కృత్రిమ మేధ (ఏఐ) పరిష్కారాలు అందించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.

దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు, హెచ్‌సీఎల్‌ టెక్‌ సీఈవో సి. విజయకుమార్‌ల మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఈ సెంటర్‌ ద్వారా 5,000 ఐటీ ఉద్యోగాలు కల్పించబడతాయి. అంతేకాక, ఇది ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ నుండి గోల్డ్ సర్టిఫికేషన్ పొందిన ప్రాంగణంగా గుర్తింపు పొందింది.

ఐటీ విస్తరణలో ముందంజ

2007 నుండి హైదరాబాద్‌ కేంద్రంగా సేవలందిస్తున్న హెచ్‌సీఎల్‌ ఇప్పటికే నగరంలో నాలుగు కార్యాలయాలను నిర్వహిస్తోంది. ఈ కొత్త సెంటర్‌తో కలిపి మొత్తం ఐదు సెంటర్లుగా విస్తరించగా, మొత్తం సీటింగ్‌ సామర్థ్యం 8,500కు చేరుకుంది.

ఈ కార్యక్రమంపై స్పందించిన సీఎం రేవంత్‌ రెడ్డి, “హైదరాబాద్‌ ఐటీ కేంద్రంగా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది. ఈ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు అందిస్తుంది,” అని తెలిపారు.

ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబు మాట్లాడుతూ, “హైదరాబాద్‌ యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించడానికి ఈ సెంటర్‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో కూడా ఐటీ విస్తరణకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి,”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు