క్యాన్సర్ వ్యాక్సిన్ ఉచితం: రష్యా కీలక ప్రకటన, ప్రపంచం ఎదురుచూపు

రష్యా శాస్త్రవేత్తలు కేన్సర్ వ్యాధిని ఎదుర్కొనే కీలకమైన mRNA టెక్నాలజీ ఆధారిత క్యాన్సర్ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసినట్లు ప్రకటించారు. ఈ టీకా 2025 జనవరిలో విడుదలకు సిద్ధంగా ఉంటుందని రష్యా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా, తమ దేశ పౌరులకు ఉచితంగా అందజేయాలని రష్యా ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది.

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఈ వ్యాక్సిన్ ప్రయోగాత్మక దశలో ఉన్నప్పుడు అందించిన కీలకమైన వివరాలను పంచుకున్నారు. గమలేయా నేషనల్ రిసెర్చ్ సెంటర్, రేడియోలోజికల్ మెడికల్ రిసెర్చ్ సెంటర్‌ల సహకారంతో రూపొందించిన ఈ వ్యాక్సిన్, కణితుల పెరుగుదలను అడ్డుకోవడంతో పాటు క్యాన్సర్ వ్యాప్తిని నియంత్రించగలదని శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు.

ఈ టీకా శరీరంలోని క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకుని రోగనిరోధక వ్యవస్థను మేల్కొలిపి యాంటీబాడీలు ఉత్పత్తి చేస్తుందని వెల్లడించారు. ముఖ్యంగా, మెటాస్టాసిస్ వంటి ప్రాణాంతక కణితులపై ఈ టీకా ప్రభావవంతంగా పనిచేస్తుందని అధ్యయనాలు స్పష్టం చేశాయి. రష్యా ప్రభుత్వం ఉచిత పంపిణీపై దృష్టి పెట్టడంతో, ఇది వైద్యరంగంలో కొత్త ఆశలను వెలిగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

తాజా వార్తలు