హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మార్చి 22న ఈడెన్ గార్డెన్స్‌లో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో తలపడనుంది. అయితే, వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడంతో వర్షం ముప్పు పొంచి ఉంది. సాయంత్రం 6 గంటలకు జరిగే ఓపెనింగ్ సెర్మనీలో బాలీవుడ్ స్టార్ దిశా పటానీ, గాయని శ్రేయా ఘోషల్, రాపర్ కరణ్ ఆజ్లా సందడి చేయనున్నారు. కానీ, వర్షం వల్ల వేడుకలు, మ్యాచ్‌కు ఆటంకం ఏర్పడే అవకాశం ఉంది.
మార్చి 20-22 మధ్య పశ్చిమ బెంగాల్‌లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం 90% ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కోల్‌కతాలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్లు కూడా సంభవించవచ్చని హెచ్చరించింది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, వర్షం కారణంగా రద్దయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది. ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారం, 74 మ్యాచ్‌లు 65 రోజుల పాటు జరగనుండగా, మే 25న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్స్‌కు కేకేఆర్‌తో ఏప్రిల్ 3, ముంబై ఇండియన్స్‌తో ఏప్రిల్ 17, సీఎస్‌కేతో ఏప్రిల్ 25 మ్యాచ్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే, తొలి మ్యాచ్ వర్షం వల్ల ప్రభావితమైతే ఐపీఎల్ నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. వేడుకల హడావిడి మధ్య వాతావరణం సహకరిస్తుందా లేదా అనేది ఉత్కంఠగా మారింది.