హైదరాబాద్, డిసెంబర్ 20, 2024: వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన “విడుదల 2” చిత్రం, 20 డిసెంబర్ 2024 న విడుదలై తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తోంది. విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి, కన్నడ కిషోర్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో నటించారు.
డిస్నీ పిక్చర్స్ నిర్మించిన ముఫాసా ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదలై తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ చిత్రానికి ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు బ్యారీ జెన్‌కిన్స్ దర్శకత్వం వహించగా, తెలుగులో మహేశ్ బాబు, బ్రహ్మనందం, ఆలీ వంటి ప్రముఖులు గాత్రదానం చేశారు.
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ దర్శకుడు సుకుమార్ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సందర్శించిన సుకుమార్, బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాలుడి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.