విద్యార్థుల కోసం యప్ టీవీ డిజిటల్ ఎడ్యు ప్లాట్‌ఫారమ్ ‘యప్మాస్టర్’ను ప్రారంభించింది. దీనిపై ప్రస్తుతం 11, 12 తరగతి విద్యార్థులకు ఐఐటీ, జేఈఈ, నీట్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. 8 నుంచి 10 తరగతి విద్యార్థులకు ఫౌండేషన్ కోర్సులు ఆఫర్ చేస్తున్నారు. లాక్డౌన్ ముగిసే వరకూ ఈ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు యప్మాస్టర్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఉదయ్ రెడ్డి తెలిపారు. ఐఐటీ జేఈఈ, నీట్ క్లాసులను ఉచితంగా వినొచ్చు.
