True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : editor@hyderabadgraphics.com, Call : 9849851841 

YS JAGAN ‌గారు మీపై కుట్ర జరుగుతోంది.. టాలీవుడ్ హీరో రామ్ ట్వీట్

టాలీవుడ్ హీరో రామ్ సంచలన ట్వీట్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్ర జరుగుతోందంటూ పెద్ద బాంబే పేల్చారు. పెద్ద కుట్ర జ‌రుగుతున్న‌ట్టుంది.. సీఎంని త‌ప్పుగా చూపించ‌డానికి.. ‘వైఎస్ జగన్ గారు మీ కింద ప‌ని‌చేసే కొంత‌మంది మీకు తెలియ‌కుండా చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల మీ రెప్యుటేష‌న్ కీ‌,మీ మీద మేం పెట్టుకున్న న‌మ్మ‌కానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్ల మీద ఓ లుక్కేస్తార‌ని ఆశిస్తున్నాం’అంటూ ట్వీట్ చేశారు. #APisWatching హ్యాష్‌ట్యాగ్‌ను పెట్టారు.

అంతేకాదు వరుసగా రెండు, మూడు ట్వీట్లు చేశారు. వాటిలో విజయవాడలో జరిగిన స్వర్ణ ప్యాలెస్, రమేష్ ఆస్పత్రి కోవిడ్ సెంటర్ అగ్నిప్రమాదంకు సంబంధించిన అంశాలను ప్రస్తావించారు. హోటల్ స్వర్ణ ప్యాలస్ ని రమేష్ హాస్పిటల్స్ వాళ్లు కోవిడ్ సెంటర్ గా మార్చక ముందు , ప్రభుత్వం అక్కడ క్వారంటైన్ సెంటర్ నిర్వహించింది. అప్పుడీ అగ్ని ప్రమాదం జరిగి ఉంటే ఎవరిని నిందించే వాళ్లు . ఫైర్ + ఫీజు ‌= ఫూల్స్.. అంద‌రినీ ఫూల్స్ చేయ‌డానికే విష‌యాన్ని ఫైర్ నుంచి ఫీజు వైపు మ‌ళ్లిస్తున్నారా?.. ఫీజుల‌ వివ‌ర‌ణ‌: మేనేజ్‌మెంట్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్న స్వ‌ర్ణ‌ప్యాలెస్‌ డైరెక్ట్ గా బిల్లింగ్ చేసింది అంటూ ట్వీట్లు చేశారు.