సూర్య రోష్ని మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీ వినయ్ సూర్య నియామకం


స్టీల్ పైప్స్, లైటింగ్, వినియోగ వస్తువులకు సంబంధించి భారతదేశ అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన సూర్య రోష్నికి మేనేజింగ్ డైరెక్టర్ గా హోల్ టైమ్ డైరెక్టర్ శ్రీ వినయ్ సూర్యను నియమించినట్లుగా సూర్య రోష్ని ప్రకటించింది. 2021 అక్టోబర్ 26 నుంచి ఈ నియామకం అమల్లోకి వస్తుంది. శ్రీ వినయ్ సూర్య స్విన్ బర్న్ యూనివర్సిటీ (ఆస్ట్రేలియా) నుంచి ఎంబీఏ చేశారు. కంపెనీ ఆశయాలు, వ్యూహాల రూపకల్పనలో కీలకపాత్ర వహించారు. ఆయన దీర్ఘకాలిక ఆశయం, కఠోర పరిశ్రమ, అంకిత భావం అన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా స్టీల్ పైపుల ఎగుమతులకు కారణంగా నిలిచాయి.
ఈ నియామకాన్ని ప్రకటిస్తున్న సందర్భంగా సూర్య రోష్ని చైర్మన్ శ్రీ జేపీ అగర్వాల్ మాట్లాడుతూ, ‘‘మేనేజింగ్ డైరెక్టర్ గా శ్రీ వినయ్ సూర్య కు స్వాగతం. 2012 నుంచి మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న శ్రీ రాజు బిస్తా తో ఆయన తన బాధ్యతలు పంచుకుంటారు. శ్రీ వినయ్ సూర్య చక్కటి నాయకత్వ ట్రాక్డ రికార్డును, మార్కెటింగ్ అనుభవం, ప్రగాఢమైన వ్యూహ రూపకల్పన నైపుణ్యం కలిగిఉన్నారు. దీర్ఘకాలిక క్లయింట్ అనుబంధాన్ని కొనసాగించే శక్తిసామర్థ్యాలు ఉన్నాయి. సూర్య రోష్నిని నూతన శిఖరాలకు చేర్చేందుకు వారిద్దరూ సన్నిహితంగా కలసి పని చేస్తారు’’ అని అన్నారు.
ఈ సందర్భంగా శ్రీ వినయ్ సూర్య మాట్లాడుతూ, ‘‘ఈ బాధ్యతలు నా పై ఉంచిన చైర్మన్, బోర్డ్ కు నా ధన్యవాదాలు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సూర్యను మరింత పటిష్ఠం చేసేందుకు నా కృషిని కొనసాగిస్తాను. మాకు అంకితభావం కలిగిన బృందం ఉంది. అంతా కలసి ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని విశ్వసిస్తున్నాం. మహమ్మారి సమయంలో అవసరాల్లో ఉన్న వారిని ఆదుకునేందుకు సూర్య ఎన్నో చర్యలు తీసుకుంది. ప్రజలకు సేవ చేయడాన్ని అది కొనసాగించనుంది. మాతో కలసి పని చేస్తున్న వారందరికీ మరింత విలువను అందించేందుకు ప్రయత్నిస్తాం’’ అని అన్నారు.