ఘనంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 101 వ ఫౌండేషన్ దినోత్సవం

దేశంలోని అత్యంత విశ్వసనీయ ప్రభుత్వ-రంగ బ్యాంకులలో ఒకటైన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన 101 వ ఫౌండేషన్ దినోత్సవాన్ని 2019 నవంబర్ 11 న ముంబైలోని నేషనల్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ (ఎన్‌సిపిఎ) లో జరుపుకుంది. గౌరవనీయమైన ఆర్థిక మరియు కార్పొరేట్ వ్యవహారాల మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు, దేశవ్యాప్తంగా మిలియన్ల మంది వినియోగదారులకు నిష్కళంకమైన బ్యాంకింగ్ సేవలను ఒక శతాబ్దానికి పైగా అందించినదానికి గుర్తుగా ఉన్న ఇంత ముఖ్యమైన మైలురాయిని ఆయన గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భారత ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శి శ్రీ రాజీవ్ కుమార్ పాల్గొన్నారు. ప్రఖ్యాత గాయకుడు-స్వరకర్త శంకర్ మహాదేవన్ గారిచే, విస్మయపరిచే సంగీత ప్రదర్శనతో సాయంత్రం ముగిసింది.

1919 సంవత్సరంలో స్థాపించబడింది మరియు దాని మొదటి ప్రధాన కార్యాలయాన్ని భారతదేశ పితామహుడు మహాత్మా గాంధీ ప్రారంభించారు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్వాతంత్య్రానికి పూర్వం మరియు అనంతరం, భారతదేశం యొక్క బ్యాంకింగ్ సాదృశ్యాన్ని రూపొందించడంలో అత్యంత కీలక పాత్ర పోషించింది మరియు ఇది దేశం యొక్క ఆర్థిక వృద్ధిని ముందుకు నడిపిస్తోంది. తన వందలకొద్దీ సంవత్సరాల కార్యకలాపాలలో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగుమతులు, వ్యవసాయం, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు మరియు ఇతర నిర్దిష్ట వ్యాపార వర్గాల వంటి అనేక రకాల పరిశ్రమలు మరియు రంగాలలో ఋణాలను విస్తరించింది. భారతదశమంతటా ఈబ్యాంక్ కార్యకలాపాలు, 4285 శాఖలలో విస్తరించి ఉన్నాయి, వీటిలో 70 మిలియన్లకు పైగా వినియోగదారులు ఉన్నారు.

ఈ సందర్భంగా గౌరవనీయ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి, శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ “100 అద్భుతమైన సంవత్సరాల సేవలను పూర్తి చేసినందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రస్తుత సాదృశ్యంలో, స్థిరమైన ఆవిష్కరణలు మరియు సాంకేతిక పురోగతితో, క్రమమైన, సమర్థవంతమైన మరియు పారదర్శక బ్యాంకింగ్ కార్యకలాపాఅ ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ విషయంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక బెంచ్ మార్కును నిర్ణయించింది. పురోగమిస్తున్నప్పుడు, బ్యాంక్ యొక్క సాంకేతిక-ఆధారిత, వినియోగదారు-ఆధారిత దృష్టి, అత్యంత ఇష్టపడే బ్యాంకులలో ఒకటిగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేయడానికి కీలకమైన అంశం అవుతుంది. ”