దేశవ్యాప్తంగా 125 ప్రాంతీయ కార్యాలయాల జాబితాను ప్రకటించిన యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా

2020 ఏప్రిల్ 1 న ఆంధ్రా బ్యాంక్ మరియు కార్పొరేషన్ బ్యాంక్‌ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో విలీనం చేసిన తరువాత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ముద్ర 9500+ శాఖలు మరియు 13,500+ ఎటిఎంలతో కూడిన భారతదేశమంతటా తన విస్తృత నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. విలీనం తరువాత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో ఒక శాఖతో, దేశంలోనే ఐదవ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా మరియు నాల్గవ అతిపెద్ద బ్యాంకింగ్ నెట్‌వర్క్ కలిగి ఉంది.

విలీనం కాబడినప్పటి నుండి గణనీయమైన స్థాయిలో విస్తరించడంతో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త నాలుగు అంచెల సంస్థ నిర్మాణాన్ని రూపొందించింది. ముంబైలోని నారిమన్ పాయింట్‌లోని చారిత్రాత్మక ప్రధాన కార్యాలయం నుండి విలీనం చేయబడిన సంస్థ యొక్క కేంద్ర కార్యాలయం (సిఓ) కొనసాగుతుంది. సెంట్రల్ ఆఫీస్‌కు 18 జోనల్ కార్యాలయాలు మరియు 125 ప్రాంతీయ కార్యాలయాలు తమ సహకారాన్ని అందిస్తాయి.

గత వారం 18 జోనల్ కార్యాలయాలను విజయవంతంగా ప్రారంభించిన తరువాత, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మొత్తం 125 ప్రాంతీయ కార్యాలయాల జాబితాను ప్రకటించింది. ఈ రోజు ముందు వర్చువల్ ఆవిష్కరణ కార్యక్రమంలో, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎండి మరియు సిఇఒ శ్రీ. రాజ్‌కిరణ్ రాయ్ జి మాట్లాడుతూ, ఇలా అన్నారు, “విలీన ప్రయాణంలో మేము ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించాము. సంస్థాగత దృక్పథంలో, దీనితో, మొత్తం 3 బ్యాంకులు ఇప్పుడు పూర్తిగా విలీనమైపోయాయి.”

విస్తరించిన ఉనికిని ఉపయోగించుకోవటానికి, 125 ప్రాంతీయ కార్యాలయాలలో 33 పూర్తిగా అమృత్ సర్, ఆనంద్, భాగల్పూర్, అనంతపురం, రాజమండ్రి, సిమ్లా, అమరావతి వంటి కొత్త ప్రదేశాలలో ఉన్నాయి.