రెండురోజులుగా నగరం బోసిపోయింది.

సంక్రాంతి. సెలవుల సందర్భంగా నగరంలోని వలసజీవుల్లో చాలా మంది సొంతూళ్లకు వెళ్లడంతో రెండురోజులుగా నగరం బోసిపోయింది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో విద్యుత్‌ వినియోగమూ తగ్గింది. అధికారులే ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. సాధారణ రోజుల్లో నిత్యం 55
మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వాడకం ఉంటుంది. నాలుగైదు రోజులుగా విద్యుత్‌ వినియోగం 47 మిలియన్‌ యూనిట్లలోపే ఉంటోంది. ఇక.. మెట్రో రైళ్లలోనూ ప్రయాణికుల రద్దీ రెండు రోజులుగా భారీగా తగ్గింది. నగర పరిధిలోని నాగోలు-రాయదురం, జేబీఎస్‌-ఎంజీబీఎస్‌, ఎల్‌బీనగర్‌-మియాపూర్‌ మార్తాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 11.15 వరకు 66 స్టేషన్ల నుంచి. రోజుకు 820 టిప్పులను నడిపిస్తున్నారు. ఈ మూడు కారిడార్ల పరిధిలో రోజుకు సగటున 2.50 నుంచి 2.70 లక్షల మంది ప్రయాణిస్తారు. బుధ, గురువారాల్లో ఆ సంఖ్య 1.5 లక్షలకు తగ్గింది. అయితే… పండుగకు ఊరెళ్లే వాహనాలన్నీ సాఫీ ప్రయాణం కోసం బెటర్‌ రింగ్‌ రోడ్డును ఎంచుకుంటుండడంతో గత నాలుగైదు రోజులుగా ఓఆర్‌ఆర్‌పై మాత్రం వాహనాల సంఖ్య బాగా పెరిగింది. ఐదు రోజుల్లో పదిలక్షల వాహనాలు బెటర్‌పై అదనంగా ప్రయాణం చేసినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రోజుకు 1.2 లక్షల వాహనాలు ప్రయాణిస్తాయి. కానీ, రెండు, మూడు రోజులుగా.. 2లక్షల నుంచి ౩లక్షల మేర వాహనాలు అదనంగా వెళ్లాయని, శుక్రవారం ఆ సంఖ్య మరింత పెరిగిందని ఓ అధికారి తెలిపారు.
ఇకపోతే. నగర రోడ్లపై ట్రాఫిక్‌ ఇబ్బందులు కానరావడం లేదు. వాహనాల రొద బాగా తగ్గింది. సాధారణంగా నగర రోడ్లపై ప్రతి రోజూ సగటున 50
లక్షల వాహనాలు తిరుగుతుంటాయి. అయితే గురవారం వాటి సంఖ్య 25 లక్షలకు తగ్గిందని… శుక్ర, శనివారాల్లో 20 లక్షల లోపే ఉండొచ్చని అధికారులు చెబుతున్నారు. ట్రాఫిక్‌ తగ్గిపోవడంతో వాహనదారులు వేగంగా గమ్య స్థానాలకు చేరుకోగలుగుతున్నారు.
రాష్ట్ర రాజధానినగరంలో.. రహదారులపై ట్రాఫిక్‌ తగ్గింది! ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు వాహనాల మోతతో _ దద్దరిల్లే రహదారులు బోసిబోయి కనిపిస్తున్నాయి. లాక్‌డౌన్‌ పెట్టినట్టుగా… పలు కాలనీలు నిర్మానుష్యంగా మారాయి. రోడ్ల వెంట తోపుడు బండ్లపై పండ్లు, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారులు గిరాకీ కోసం పడిగాపులు కాసారు.
నాలుగు రోజుల క్రితం వరకూ.. ఐటీ కారిడార్‌లోని రోడ్లపై నిమిషానికి వేలాది వాహనాలు రాకపోకలు సాగించిన పరిస్థితి ఉండగా… పదుల సంఖ్యలోనే కనిపించాయి. నగరంలోని రహదారులపై రద్దీ తగ్గినా… రైల్వేస్టేషన్లు, ఆర్టీసీ బస్టాండ్లు మాత్రం కిటకిటలాడిపోతున్నాయి. సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి 8.80 లక్షల మంది తరలివెళ్లినట్లు రైల్వేవర్గాలు తెలిపాయి. ఆర్టీసీ
బస్సుల ద్వారా 1.80 లక్షల మంది ప్రయాణించినట్లు అధికారులు చెప్పారు. అటు హైదరాబాద్‌-విజయవాడ