యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం: చెరువులోకి దూసుకెళ్లిన కారు, ఐదుగురు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్‌పూర్ వద్ద ఓ కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు యువకులలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతులను హైదరాబాద్ హయత్‌నగర్‌కు