సంధ్య థియేటర్ ఘటనపై అల్లు అర్జున్ స్పందన: రేవతి కుటుంబానికి రూ. 25 లక్షల సాయం

హైదరాబాద్, డిసెంబర్ 7: పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో చోటు చేసుకున్న తొక్కిసలాట ఘటనపై ప్రముఖ నటుడు అల్లు అర్జున్ భావోద్వేగంతో స్పందించారు. ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించడం, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడటంపై అల్లు అర్జున్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం