సుకుమార్‌ శ్రీతేజ్‌ను పరామర్శించి కుటుంబానికి సాయం

సంధ్య థియేటర్‌ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సినీ దర్శకుడు సుకుమార్‌ గురువారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను సందర్శించిన సుకుమార్‌, బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాలుడి కుటుంబానికి తన వంతు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

సంధ్య థియేటర్ తొక్కిసలాట: కిమ్స్ ఆసుపత్రిలో శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్

హైదరాబాద్‌: ఆర్టీసీ క్రాస్‌ రోడ్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడి కిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజ్‌ను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ బుధవారం పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో ఆస్పత్రికి వెళ్లిన అల్లు అరవింద్‌, శ్రీతేజ్