Contact | Trending​ | Breaking​ | Feedback​ | Login​

ఘోర అగ్నిప్రమాదం: ఏలూరులో 20 గుడిసెలు దగ్ధం, ఆరుగురికి గాయాలు

ఏలూరు జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదంలో 20 గుడిసెలు పూర్తిగా దగ్ధమయ్యాయి. మండవల్లి మండలం భైరవపట్నం గ్రామంలో నివాసం ఉంటున్న పక్షుల వేటగాళ్లకు చెందిన కుటుంబాలు ఈ ప్రమాదానికి గురయ్యాయి. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు సహా ఆరుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.

తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఏపీలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రమైన అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ రాష్ట్ర కోస్తా వైపు పయనిస్తోంది. ఈ ప్రభావంతో శుక్రవారం, 20 డిసెంబర్ 2024 న విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, శ్రీకాకుళం వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం