పార్లమెంటులో గందరగోళం: అదానీ వివాదంపై చర్చకు విపక్షాల పట్టుబాటు

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు గందరగోళం మధ్య కొనసాగుతున్నాయి. భారత పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అమెరికాలో అభియోగాలు నమోదైన నేపథ్యంతో, ఈ అంశంపై చర్చించాలని ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. దీంతో లోక్‌సభ, రాజ్యసభలు వాయిదాలకు గురయ్యాయి. పార్లమెంటు సభ్యుల మధ్య నిరసనలు హోరెత్తగా, సభా కార్యకలాపాలకు తీవ్ర అంతరాయం