స్పేస్‌ విజన్‌ సీఎండీ టి. నరసింహా రెడ్డికి గౌరవ డాక్టరేట్‌

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ టి. నరసింహా రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. దక్షిణ అమెరికాలోని పనామా సిటీలోని స్వాహిలీ ఇండో–అమెరికన్‌ విశ్వ విద్యాలయం నుంచి డాక్టరేట్‌ను యూనివర్సిటీ ప్రధాన కేంద్రం అయిన గోవా లో హోటల్ ది తాజ్, పంజిమ్ గోవా లో శ్రీ జగన్నాధ్ పట్నాయక్, వైస్ ఛాన్సలర్, ICFAI University చేతుల మీదుగా అందుకున్నారు. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ స్పెషలైజేషన్‌ సేవలకు గాను ఈ గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేసినట్లు యూనివర్సీటీ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీ నియామక పత్రంలో తెలిపింది.
నరసింహా రెడ్డి ప్రస్థానమిదే..
ప్రకాశం జిల్లా మర్రిపుడి మండలం గుండ్ల సముద్రం గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి 1976, ఆగస్టు 17న జన్మించారు. గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన ఆయన ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగ రీత్యా హైదరాబాద్‌కు వచ్చారు. పలు కంపెనీల్లో మార్కెటింగ్‌ రంగంలో పని చేస్తూ.. 2008లో సొంతంగా స్పేస్‌ విజన్‌ గ్రూప్‌ను స్థాపించారు. ఇప్పటివరకు సుమారు 15 ప్రాజెక్ట్‌లు, 1,500 ఎకరాల్లో ఓపెన్‌ ప్లాటను అభివృద్ధి చేశారు. 5 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణాలను పూర్తి చేశారు. స్పేస్‌ విజన్‌కు 15 దేశాల నుంచి సుమారు 25 వేలకు పైగా కస్టమర్లున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *