విస్తృత సూచీల మెరుగైన పనితీరు కనబరచినా కూడా, పతనాన్ని కొనసాగించిన సెన్సెక్స్, ఎన్‌ఎస్‌ఇలు

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

భారతీయ స్టాక్ మార్కెట్లు, ఐటి, ఫార్మాస్యూటికల్ విభాగాల స్టాక్స్ లలో విక్రయ ఒత్తిడి కారణంగా ఈ రోజు కూడా తమ పతనాన్ని కొనసాగిస్తున్నాయి. ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్న సమయం వరకు సెన్సెక్స్ 1.35 శాతం పెరిగి 31,086.70 పాయింట్లను తాకింది. అదేవిధంగా, నిఫ్టీ -50 ట్రేడింగ్ సెషన్ మధ్యాహ్నం తరువాత కేవలం లాభాలను పొందడానికే అన్నట్లుగా, దాని బెంచిమార్క్ 9,161.65 కు పెరిగింది.

మంగళవారం రోజున, మార్కెట్లు ముగిసే సమయానికి, సెన్సెక్స్ 63.29 పాయింట్లు లేదా 0.21 శాతం తగ్గి 30,609.30 కు పడిపోయింది మరియు నిఫ్టీ 10.20 పాయింట్లు లేదా 0.11 శాతం తగ్గి 9,029.05 వద్ద స్థిరపడింది.

11 రంగాల సూచీలలో ఎన్‌ఎస్‌ఇలో ఎనిమిది సానుకూలంగా (ఆకుపచ్చ రంగులో) ముగిశాయి, నిఫ్టీ మెటల్, ఆటో మరియు బ్యాంకింగ్ వరుసగా 2.7 శాతం, 1.51 శాతం మరియు 0.9 శాతం పెరిగాయి.

ఎస్ అండ్ పి బిఎస్ఇ టెలికాం సూచికలో తన విలువలో విలువలో 4.6 శాతం నష్టపోయి, తనపై విక్రయ ఒత్తిడి కనిపించగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ ఐటి ఇండెక్స్ 2.1 శాతం తగ్గిపోయింది. బిఎస్‌ఇ హెల్త్‌కేర్ ఇండెక్స్ కూడా తన విలువలో 0.65 శాతం నష్టపోయింది.

ఈ రోజు అత్యధికంగా నష్టపోయిన వారిలో, ఎయిర్‌టెల్ దాని విలువలో 5% కంటే ఎక్కువ కోల్పోయి 557.95 రూపాయలకు చేరుకుంది. బజాజ్ ఫిన్సర్వ్ (-5.06%), పిరమల్ ఎంటర్ప్రైజెస్ (-4.94%), రిలయన్స్ ఇన్ఫ్రా (-4.82%), ఇండియాబుల్స్ వెంచర్స్ (-4.81%), రిలయన్స్ క్యాపిటల్ (-4.58%) ఈ రోజు నష్టపోయిన వారిలో ఉన్నారు.

ఈ రోజు అత్యధిక లాభాలు పొందిన వారిలో జెఎస్‌పిఎల్ (12.99%), గోద్రేజ్ ఇండస్ట్రీస్ (12.40%), అదాని పవర్ (11.21%), ఆదిత్య బిర్లా క్యాపిటల్, (7.38%) ఉన్నాయి.

భారతదేశంలో విమాన ప్రయాణం 2 నెలల విరామం తర్వాత ప్రారంభమైనప్పటికీ, ఏవియేషన్ స్టాక్స్ మంగళవారం కూడా తక్కువ పనితీరును కనబరచాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ దాని విలువలో 3.31% నష్టపోయి ఈ రోజు రూ. 942 వద్ద ముగిసింది. అదేవిధంగా, స్పైస్ జెట్ కూడా దాని విలువలో 1.45% నష్టపోయి రూ. 44.30 వద్ద ముగిసింది.

ప్రపంచ మార్కెట్లు

మంగళవారం రోజున, ఆసియా స్టాక్స్ సానుకూలంగా ప్రారంభమయ్యాయి, జపాన్ నిక్కీ 1.7 శాతం ఆధిక్యంలో ఉంది. జపాన్ వెలుపల ఆసియా-పసిఫిక్ షేర్ల యొక్క ఎం.ఎస్.సి.ఐ యొక్క విస్తృత సూచీ 1.6 శాతం పెరిగింది. నేటి వాణిజ్యంలో ఎఫ్.టి.ఎస్.ఇ 1.11% లాభపడింది.

కమాడిటీస్ మార్కెట్లలో, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పునరుజ్జీవనం అయ్యే సంకేతాలు ఉన్నప్పటికీ, ముడి చమురు సరఫరాను తగ్గించడానికి ఒపెక్ చూపిన విశ్వాసం వెనుక చమురు ధరలు పైపైకి ఎగబాకడాన్ని ప్రదర్శించాయి.