ముంబై: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు బీసీసీఐ జీవిత సాఫల్య పురస్కారం (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు) ప్రకటించింది. భారత క్రికెట్‌కు అనూహ్యమైన సేవలు అందించిన సచిన్‌కు ఈ పురస్కారం అందజేయనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. ఈ అవార్డు స్వీకరించే 30వ క్రికెటర్‌గా సచిన్ నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో 664 మ్యాచ్‌లు ఆడి, 34,357 పరుగులు సాధించిన సచిన్, 2011 వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అదే కార్యక్రమంలో, 2023-24 సీజన్‌కు గాను ఉత్తమ పురుష క్రికెటర్‌గా జస్‌ప్రీత్ బుమ్రాను, ఉత్తమ మహిళా క్రికెటర్‌గా స్మృతి మంధానాను బీసీసీఐ ఎంపిక చేసింది. బుమ్రా గత సీజన్‌లో టెస్ట్ క్రికెట్‌లో 71 వికెట్లతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. మంధాన 2024లో వన్డేల్లో అత్యధిక పరుగులు చేసినందుకు ఈ పురస్కారాన్ని అందుకుంటుంది