క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఎందుకంత ఆనందం అందిస్తోంది…ఇవీ కారణాలు

చివరిసారిగా మీరు ఎప్పుడు మీకు ఎంతో ఉద్వేగం కలిగించిన మోబా గేమ్ ఆడారు ? కచ్చితంగా ఇప్పటి వరకూ ఆడిఉండరు. క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఇప్పుడు మొబైల్ ప్లాట్ ఫామ్స్ పైకి రావడంతో ఎదురుచూపులు ఇక ముగిశాయి. శక్తివంతమైన హెచ్ డి గేమింగ్ వాతావరణంలో క్లాష్ ఆఫ్ టైటాన్స్ అనేది భారతదేశపు మొట్టమొదటి మొబైల్ మోబా గేమ్ అయింది. ఇది మొబైల్ ఇంటర్ ఫేస్ డైనమిక్స్ లోనే మహా పోరాటాల థ్రిల్ ను అందిస్తుంది.
జట్టు ఆధారితంగా ఆడే మొబా ఫార్మాట్ రణరంగంలో ఎప్పటికప్పు డూ మారుతూ ఉండే సన్నివేశాలను అందిస్తుంది. తమ ప్రత్యర్థుల వ్యూహాలను ఎదుర్కొనేందుకు రియల్ టైమ్ లో ఆటగాళ్లు అంతాకలసి పని చేయాల్సి ఉంటుంది. మీ ఆట స్టైల్ కు అనుగుణంగా ఎంచుకునేందుక వీలుగా క్లాష్ ఆఫ్ టైటాన్స్ 56 విశిష్ట టైటాన్స్ ను అందిస్తుంది. అంతేకాదు, మీరు మీ టైటాన్ ను యుద్ధక్షేత్రంలో మెరిసిపోయేలా చేసేందుకు ఎన్నో రకాల స్కిన్స్ తో కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. మీలో ఉండే భావోద్వేగాలను అణచివేసుకోవద్దు. మీ స్నేహితులను ఆహ్వానించండి, జట్టు కట్టండి. తిరుగులేని పోరాటంలో విజయం సాధించండి.
డ్యూయల్ – చానల్ కనెక్షన్ మోడ్
క్లాష్ ఆఫ్ టైటాన్స్ జట్టు లాగ్ – ఫ్రీ గేమింగ్ అనుభూతి అవసరాన్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.ఈ అనుభూతులు ఈ గేమ్ ను మొబైల్ గేమింగ్ లో స్మూతెస్ట్ ఇంటర్ ఫేస్ లలో ఒకటిగా చేశాయి. వైఫ్ మరియు మొబైల్ డేటా సమ్మేళనం ద్వారా నెట్ వర్క్ కనెక్టివిటీలో ఉండే హెచ్చుతగ్గులను అధిగమించవచ్చు. ఇది నిరంతరాయ గేమింగ్ అనుభూతికి వీలు కల్పిస్తుంది.
విభిన్న రకాల స్కిన్స్ మరియు పాత్రలు

ఆటగాళ్లు తమ భావోద్వేగాలను ఆటలో ప్రదర్శించేందుకు క్లాష్ ఆఫ్ టైటాన్స్ ప్రపంచం వీలు కల్పిస్తుంది. మీ వ్యక్తిత్వానికి మీ టైటాన్ ప్రాతినిథ్యం వహించేలా చేయండి. నూతన స్కిన్స్ మీరు యుద్ధానికి సిద్ధంగా ఉన్న లుక్ ను అందిస్తాయి. రణరంగాన్ని మీ నియంత్రణలోకి తెచ్చుకోండి.

తిరుగులేని పోరాటాలు
మరింత సేపు ఆడేందుకు సమయం లేదా…దాని గురించిన సమస్యనే లేదు. క్లాష్ ఆఫ్ టైటాన్స్ 20 సూపర్ ఛార్జ్ డ్ నిమిషాల సేపు మాత్రమే ఉంటుంది. అందుకే ఒక రౌండ్ ఆడినా లేదా పలు రౌండ్లు ఆడుతున్నా ఎంత సేపు ఆడాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకోవచ్చు.

5వి5 గేమ్ ప్లే లో అగ్రగామి
చాలా మంది పోటీదారులు, జట్టుసభ్యులు ఉంటే ఆట తరచూ గందరగోళానికి దారి తీస్తుంది. ఒక్కరే ఉంటే….ఫన్ ఉండదు. ఇద్దరు ఉంటే …కాస్తంత కొత్తదనం. ముగ్గురు ఉంటే…వారు మాత్రమే సరిపోరు. నలుగురు….ఇంకా బోర్ గానే ఉంటుంది. మరింకెందుకు ఆలస్యం. గో లైవ్. అవును. సిఒటి ఈ అత్యుత్తమ మోబా గేమింగ్ ను 5 వి 5 పోరాటాలుగా మార్చేసి గేమ్ ప్లే అనుభూతిని అందిస్తుంది.

నిరంతర నిమగ్నత
క్లాష్ ఆఫ్ టైటాన్స్ మల్టీ ప్లేయర్ టీమ్ బేస్డ్ యుద్ధాలను అందిస్తుంది, మోబా ఫార్మాట్ కు అనుగుణంగా. ఎన్నో వ్యూహాలు, డైనమిక్ గేమ్ ప్లే లాంటివి ప్రతీ మ్యాచ్ ను కూడా ఒక ప్రత్యేకమైందిగా చేస్తాయి. ఎందుకంటే ప్రత్య ర్థుల వ్యూహాలకు రియల్ టైమ్ లో స్పందించాల్సి ఉంటుంది. నిజమే…ప్రతీ విజయాన్ని కష్టపడి సాధించాల్సిం దే.


ముగింపు
మొదటి భారతీయ మొబైల్ మోబాగా క్లాష్ ఆఫ్ టైటాన్స్ ఈ తరహా గేమ్స్ లో అగ్రగామిగా ఉంది. టైటాన్ల సంఖ్య, ఎంగేజింగ్ గేమ్ ప్లే, ఆన్ గోయింగ్ సపోర్ట్, క్రమం తప్పకుండా నూతన కంటెంట్ …ఇవన్నీ కూడా గేమర్లు పూర్తి స్థాయిలో సంతృప్తి చెందేలా చేస్తాయి.