ప్రారంభ‌మైన ప్ర‌ణీత్ ప్రీమియ‌ర్ లీగ్ క్రికెట్ పోటీలు– పీపీఎల్ సీజ‌న్‌-3
– గెలుపు జ‌ట్టుకు ఐదు ల‌క్ష‌లు

ప్ర‌ణీత్ గ్రూప్ కంపెనీల ఆధ్వ‌ర్యంలో ప్రణీత్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-3 క్రికెట్ పోటీలు ప్ర‌ణీత్ ప్ర‌ణ‌వ్ గ్రోవ్ పార్క్ ప్రాజక్ట్‌లో ప్రారంభ‌మైనాయి. ఈ పోటీల‌ను ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర‌కుమార్ కామ‌రాజు ప్రారంభించారు. హైద‌రాబాద్ న‌గ‌రంలోని దుండిగ‌ల్ ఉన్న రావూస్ క్రికెట్ , బౌరంపేట‌లోని ఒలింపియా క్రికెట్ గ్రౌండ్‌, బాచుప‌ల్లిలో ఉన్న సీఏబీఏ క్రికెట్ గ్రౌండ్‌లో ప్ర‌తి శ‌ని, ఆదివారం రోజుల్లో మే 21 వ‌ర‌కు లీగ్ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. సీఏబీఏ క్రికెట్ గ్రౌండ్‌లో మే 22 సెమి ఫైనల్స్‌, 28న ఫైనల్స్ మ్యాచ్‌లు జ‌రుగుతాయ‌ని నిర్వ‌హ‌కులు తెలిపారు. లీగ్ మ్యాచ్‌ల‌లో 16 ఓవ‌ర్లు, సెమి ఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచ్‌లో 20 ఓవర్లు ఉంటాయి. ఈ పీపీఎల్ సీజ‌న్ త్రీలో మొత్తం 14 జ‌ట్లు పాల్గొన‌నున్నాయి. ఈ సీజ‌న్‌లో విజేతగా నిలిచిన జట్టుకు రూ.5 లక్ష‌ల న‌గ‌దు బ‌హుమ‌తి, రెండో విజేత‌కు రూ.3 ల‌క్ష‌లు, మూడు, నాలుగు స్థానాలు పొందిన జ‌ట్టుల‌కు ర‌న్ రేట్ ఆధారంగా రూ.1 ల‌క్ష వంతున న‌గ‌దు బ‌హుమ‌తి అంద‌జేస్తామ‌న్నారు. మ్యాన్ ఆఫ్ ది సీరిస్‌కు ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌కు రూ.15 వేలు విలువ చేసే ఫోన్ బహుమ‌తిగా ఇవ్వ‌నున్నారు. బెస్ట్ బౌల‌ర్‌, ఎక్కువ సిక్స‌ర్లు, అధిక వికెట్లు తీసిన ఆట‌గాళ్ల‌కు ప్ర‌త్యేకంగా బ‌హుమ‌తులు అంద‌జేయ‌నున్న‌ట్లు న‌రేంద్ర‌కుమార్ కామ‌రాజు వెల్ల‌డించారు.