ఒకినవా 25% శాతం సిబ్బందితో తయారీ యూనిట్‌ని పునరుద్ధరించింది.

‘మేక్ ఇన్ ఇండియా’ మీద దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినవా తన కార్పొరేట్ ఆఫీసు మరియు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వద్ద 25శాతం వర్క్‌ఫోర్స్‌తో తన కార్యకలాపాలను పునరుద్ధరించినట్లుగా నేడు ప్రకటించింది. ప్రభుత్వం యొక్క తదుపరి సడలింపుల ఆధారంగా, తన బిజినెస్ కార్యకలాపాలను ప్రారంభిస్తుండటంతో ఒకినవా పనిప్రాంతం, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, మరియు డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నట్లుగా ధృవీకరించింది. బ్రాండ్ తన డీలర్‌షిప్ నెట్‌వర్క్‌కు ఎడ్వైజరీ జారీ చేసింది, ఇది కూడా 25% సిబ్బందితో ఆపరేట్ చేస్తోంది. అదే సమయంలో, తయారీ యూనిట్ వద్ద అసెంబ్లీ నుంచి బట్వాడా చేయబడే అన్ని ప్రొడక్ట్‌లు ముందుగా శానిటైజ్ చేయబడతాయి మరియు డీలర్ పార్టనర్‌లు కూడా ప్రొడక్ట్‌లు అందుకున్న తరువాత శానిటైజ్ చేస్తారు. ఖాతాదారులు మరియు డీలర్‌ల భద్రతను ధృవీకరించడానికి, సలహా మేరకు అన్ని ఒకినోవా డీలర్‌షిప్‌ల వద్ద సరైన థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించబడుతుంది.

అలానే, ఆరెంజ్ మరియు గ్రీన్ జోన్‌ల్లో తిరిగి ప్రారంభించబడ్డ అన్ని డీలర్‌షిప్‌లు కూడ రోజువారీగా నిర్జలీకరణ చేయబడతాయి.
కార్పొరేట్ ఆఫీసు వద్ద, సామాజిక దూరం పాటించడం కొరకు ఉద్యోగుల సీటింగ్ ఏర్పాటుపైన కూడా తగిన భద్రతా చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ సలహాను అనుసరించి, బ్రాండ్ మాస్క్‌లు మరియు ఇతర ప్రొటెక్టివ్ ఎక్విప్‌మెంట్‌తోపాటుగా ఉద్యోగుల కొరకుు ఆరోగ్య సేతు మొబైల్అప్లికేషన్‌ని తప్పనిసరి చేసింది. హ్యూమన్ రిసోర్సెస్ ఇనిషియేటివ్‌గా, అన్ని డిపార్ట్‌మెంట్‌లు ఎస్‌వోపికి కట్టుబడి ఉండేలా ధృవీకరించడానికి ప్రత్యేక కమిటీలు కేటాయించబడ్డాయి. హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్ ప్రతిరోజూ ఉద్యోగులతో కొవిడ్ 19 అవగాహనా సెషన్‌లు నిర్వహిస్తుంది. అలానే, ఏదైనా వైద్య అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రికి ఉద్యోగులను రవాణా చేయడానికి మరియు ఒకవేళ పాజిటివ్ అని తేలినట్లయితే ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌కు తరలించడానికి ఒక ప్రత్యేక టీమ్‌ని సిద్ధం చేసింది.
ఇదే సమయంలో, తయారీ కార్యకలాపాలను పునరుద్ధరించడానికి ముందు, ప్లాంట్ వద్ద వ్యక్తుల కొరకు శానిటైజేషన్ టన్నెల్‌ని కూడా ఇన్‌స్టాల్ చేసింది.
దేశవ్యాప్తంగా ఇటువంటి దురదృష్టకరమైన ఘటనల్లో ఒక బాధ్యతాయుతమైన బ్రాండ్‌గా ఒకినవా తన వర్క్‌ఫోర్స్, డీలర్ పార్టనర్‌ మరియు ఖాతాదారుల సంరక్షణ కొరకు అన్ని సంభావ్య చర్యలు తీసుకుంటుంది. ఈ క్లిష్టమైన సవాళ్లతో కూడిన సమయంలో ముందుకు సాగడానికి మనం ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది. ఆర్ధిక కార్యకలాపాలకు ప్రభుత్వం సడలింపు ప్రకటించడం వల్ల, మేం వ్యాపార కార్యకలాపాలను క్రమేపీ ప్రారంభించాలని, అన్ని జాగ్రత్తలు పాటించాలని మేం నిర్ణయించుకున్నాం. అందువల్ల, అన్ని టచ్‌పాయింట్‌ల భద్రత మరియు శానిటైజేషన్‌ని మేం ధృవీకరిస్తున్నాం. కంపెనీ భద్రతను ధృవీకరించడానికి మేం మా డీలర్ షార్టనర్‌లకు అడ్వైజరీని జారీ చేశాం అలానే మా వర్క్‌ఫోర్స్‌కు సమగ్రమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసజీర్‌ని జారీ చేశాం’’ అని శ్రీ జితేందర్ శర్మ-ఎమ్‌డి ఒకినవా పేర్కొన్నారు.
కొవిడ్-19 నేపథ్యంలో, ఒకినవా తమ డీలర్‌లు మరింత ఎక్కువ లాభాలు సంపాదించడం కొరకు మార్జిన్‌ని 8 శాతం నుంచి 11కు పెంచినట్లుగా కూడా ప్రకటించింది. బ్రాండ్ తనయొక్క భాగస్వాములు అందరి ఆరోగ్యం మరియు భద్రతకు అన్నివిధాలుగా సహకరించేందుకు మరియు బాధ్యత తీసుకునేందుకు కట్టుబడి ఉంది.