ఒకినోవా స్కూటర్స్‌ నుంచి లైట్‌

విద్యుత్‌ వాహనాల తయారీదారు ఒకినోవా స్కూటర్స్‌ తన సరికొత్త స్పీడ్‌ ఇ-స్కూటర్‌ ‘లైట్‌’ను ఆవిష్కరించింది. ఎక్స్‌ షోరూమ్‌ వద్ధ దీని ధరను రూ.59,990గా నిర్ణయించింది. దేశంలోని మార్పునకు చోదకులుగా ఉండే యువత, మహిళలను లక్ష్యంగా చేసుకొని దీన్ని అందుబాటులోకి తెచ్చినట్లు ఒకినోవా ఆటోటెక్‌ ఎండి జితేందర్‌ శర్మ పేర్కొన్నారు. దీని బ్యాటరీపై 3 ఏళ్ల వారంటీ ఇస్తున్నట్లు తెలిపారు. ఇది గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఒక్క చార్జ్‌తో 50-60 కిలోమీటర్లు వెళ్లగలదు.