4 కోట్ల జన్‌ధన్‌ ఖాతాల్లో ₹ 500 చొప్పున జమ

మహిళలకు చెందిన 4.07 కోట్ల జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.500 చొప్పున జమ చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో మొత్తం మూడు నెలల పాటు రూ.500 చొప్పున కేంద్రం ఆయా ఖాతాల్లో జమ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. మిగిలిన 20.39 కోట్ల ఖాతాల్లో ఏప్రిల్‌ వారాంతానికి జమ చేస్తామని అధికార వర్గాలు తెలిపాయి. నగదు విత్‌డ్రా సమయంలోనూ సామాజిక దూరం పాటించాలన్న ఉద్దేశంతో బ్యాంకు ఖాతా చివరి అంకె ఆధారంగా ఆయా తేదీల్లో మాత్రమే నగదు ఉపసంహరించుకునేలా ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.