ఎయిమ్స్ ఢిల్లీ తన అధునాతన కోవిడ్-19 వార్డులో మిలాగ్రో రోబోలను ఉపయోగించనుంది

ముందు జాగ్రత్త చర్యల దృష్ట్యా, ఆరోగ్య కార్యకర్తలకు మరియు కరోనావైరస్ సోకిన రోగులకు మధ్య భౌతిక దూరాన్ని నిర్వహించడానికి ఈ రోబోలు, ఎయిమ్స్ కు సహాయపడతాయి

భారతదేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ, పెరుగుతున్న కోవిడ్ -19 కేసులతో తలమునకలై ఉండగా, ఈ బృహత్కార్యంలో సహకారం అందించడానికి, భారతదేశ నంబర్ 1 కన్స్యూమర్ రోబోటిక్స్ బ్రాండ్ మిలాగ్రో, ఎయిమ్స్, ఢిల్లీకి తన వంతు పాత్రను పోషిస్తోంది. ఈ కృషిలో భాగంగా, తన అధునాతన ఎఐ-పవర్ తో పనిచేసే రోబోలు – మిలాగ్రో ఐమాప్ 9 మరియు హ్యూమనాయిడ్ ఇఎల్‌ఎఫ్ లు – ఢిల్లీలోని ఎయిమ్స్ లోని అధునాతిన కోవిడ్ -19 వార్డులో నేటి నుంచి ఉపయోగించి పరీక్షించబడతాయి.

భారతదేశంలో తయారు చేయబడిన, మిలాగ్రో ఐమాప్ 9 అనేది ఒక ఫ్లోర్ క్రిమిసంహారక రోబో, ఇది మానవ జోక్యం లేకుండానే నేవిగేట్ చేసి, నేల ఉపరితలాలను శుభ్రపరచగలదు. ఇది ఐసిఎంఆర్ సిఫారసు చేసిన విధంగా సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని ఉపయోగించి నేల ఉపరితలాలపై కోవిడ్ బీజకణాలను నాశనం చేస్తుంది. రోబో క్రింద పడకుండా స్వయంచాలకంగా కదులుతుంది, లిడార్ మరియు అధునాతన స్లామ్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్గనిర్దేశం చేయబడిన దాని స్వంత మార్గంతో అడ్డంకులను అధిగమిస్తూ పనిచేస్తుంది. మిలాగ్రో యొక్క పేటెంట్ పొందిన రియల్ టైమ్ టెర్రైన్ రికగ్నిషన్ టెక్నాలజీ (ఆర్ టి 2 ఆర్ టి) 1600 దూరం కంటే 8 మిమీ వరకు ఖచ్చితత్వంతో వాస్తవ సమయంలో ఫ్లోర్ ను అలకడానికి, 3600  స్కాన్ చేసి, సెకనుకు 6 సార్లు శుభ్రపరుస్తుంది. ఇది మొదటి ప్రయత్నంలో విజయవంతంగా పనిచేయడానికి ఐమ్యాప్ 9 ను అనుమతిస్తుంది, అయితే ఇతర రోబోలకు వీటి కంటే రెండు లేదా మూడు రెట్ల ఎక్కువ సమయం పడుతుంది. అదనంగా, రోబోలు జోనింగ్ చేయగలవు, నివారించగల ప్రాంతాల వర్చువల్ బ్లాకింగ్ మరియు నిర్దిష్ట అవసరాల ఆధారంగా జోన్లను క్రమవారీగా శుభ్రపరచడం కూడా చేయగలవు.

మిలాగ్రో హ్యూమనాయిడ్ ఇఎల్‌‌ఎఫ్, కోవిడ్ -19 అంటువ్యాధి సోకిన రోగులను, దూరం నుండే, వ్యక్తి-వ్యక్తి-తాకకుండానే, పర్యవేక్షించడానికి మరియు సంభాషించడానికి వైద్యులకు వీలుకల్పిస్తుంది, తద్వారా అంటువ్యాధి సోకే అపాయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఐసోలేషన్ వార్డులలో ఉంటూ, విసుగు చెందిన రోగులు ఈ రోబో ద్వారా ఎప్పటికప్పుడు వారి బంధువులతో కూడా సంభాషించవచ్చు. హ్యూమనాయిడ్ ఇఎల్‌‌ఎఫ్ వార్డు చుట్టూ స్వతంత్రంగా నావిగేట్ చేయవచ్చు మరియు ఇది హై డెఫినిషన్ వీడియో మరియు ఆడియోలో కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. 8 గంటల బ్యాటరీ మన్నికను అందించే ఇది గంటకు 2.9 కిలోమీటర్లు ప్రయాణించగలదు, 92 సెం.మీ పొడవు, అరవైకి పైగా సెన్సార్లు, ఒక 3డి మరియు ఒక హెచ్‌డి కెమెరా మరియు 10.1 “డిస్ప్లే స్క్రీన్ కలిగి ఉంటుంది. అధునాతన హ్యూమనాయిడ్ ఫీచర్స్ భావోద్వేగం కలిగిన  కళ్ళు, ఓపెన్ మరింత అభివృద్ధి మరియు అనుకూలీకరణ కోసం ఓపెన్ ఎపిఐ కలిగి ఉంటుంది. మిలాగ్రో ఐమాప్ 9 మరియు హ్యూమనాయిడ్ ఇఎల్‌‌ఎఫ్, రెండూ కూడా, ఆటో ఛార్జింగ్ ఫీచర్‌స్ కలిగి ఉంటాయి.

“ఈ అభివృద్ధిని ధృవీకరిస్తూ, ఎయిమ్స్ డైరెక్టర్ రందీప్ గులేరియా మాట్లాడుతూ, ఇలా అన్నారు, “మిలగ్రో ఫ్లోర్ రోబోట్ ఐమాప్ 9.0 & మిలాగ్రో హ్యూమనాయిడ్ న్యూ ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో ప్రయోగాత్మకంగా ప్రయత్నించబడుతుంది”.

2007 నుండి కార్యకలాపాలు సాగిస్తున్న, మిలాగ్రో, భారతదేశంలో వినియోగదారుల రోబోటిక్స్ విభాగంలో ముందంజలో  ఉన్నారు. దాని “హ్యూమన్ టెక్” విభాగం, 2016 లో భారతదేశపు మొట్టమొదటి డ్రై అండ్ వెట్ 3డి మ్యాపింగ్ ఫ్లోర్ క్లీనింగ్ రోబోతో సహా, ఇంటెలిజెంట్ రోబోట్లను విజయవంతంగా ఆవిష్కరించింది. ఎయిమ్స్ ఢిల్లీతో భాగస్వామ్యం ద్వారా, మిలాగ్రో, ఇప్పుడు ఈ అంటువ్యాధిని ఆపడానికి భారతదేశం చేసే కృషిలో తనవంతు పాత్రను పోషించాలని ఎదురుచూస్తొంది.

తన ఆలోచనలను పంచుకుంటూ, మిలాగ్రో వ్యవస్థాపక ఛైర్మన్ రాజీవ్ కార్వాల్ ఇలా అన్నారు, “కరోనా మహమ్మారిపై పోరాడటానికి ఎయిమ్స్ యొక్క కృషిలో మిలాగ్రో రోబోలు తనవంతు సహకారం అందించడానికి ఎంతో ఆనందిస్తోంది మరియు వాస్తవ పరిస్థితుల అభిప్రాయాల ఆధారంగా మరిన్ని ఉత్పత్తులను అభివృద్ధి చేయు లక్ష్యంతో పనిచేయాలనుకుంటోంది. కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడంలో మానవ జోక్యాన్ని తగ్గించడానికి యునైటెడ్ స్టేట్స్, చైనా మరియు ఇటలీ వంటి దేశాలు ఇప్పటికే ఆరోగ్య-సదుపాయాలలో ఎఐ- ఆధారిత రోబోలను విజయవంతంగా వినియోగించాయి మరియు భారతదేశం కూడా అదే విధమైన ప్రతిరూపాలను చేయగలదు. కరోనా వైరస్ భయంకరంగా ఎక్కువగా వ్యాపిస్తున్నందున, మన అత్యాధునిక రోబోలు వైరస్ వ్యాప్తిని తనిఖీ చేస్తున్న వైద్యులు, నర్సులు మరియు సంరక్షకులను, వ్యాధి బారిన పడకుండా కాపాడటానికి తోడ్పడతాయి.”