ప్రభుత్వ ఉద్దీపన దోహదకారిని మార్కెట్లు స్వాగతించాయి, సెన్సెక్స్ మరియు నిఫ్టీలు ఒక్కొక్కటీ 2% కంటే ఎక్కువ పెరిగాయి

శ్రీ అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

మంగళవారం సాయంత్రాన, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడి గారి ద్వారా కరోనావైరస్-బాధిత భారత ఆర్ఠికవ్యవస్థకు తోడ్పాటుగా ప్రకటించబడిన రూ. 20 లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజి, నేటి భారత స్టాక్ మార్కెట్లపై ఒక సానుకూల ప్రభావం చూపింది. రెండు సూచీలు – ఎస్& పి బిఎస్‌ఇ సెన్సెక్స్ మరియు నిఫ్టీ 50 – రెండురోజుల నష్టాలకు అడ్డుకట్ట వేసాయి.  నిఫ్టీ -50 9,383.55 పాయింట్లతో, 187.00 పాయింట్లు లేదా 2.03% పెరగగాగి, 30 షేర్ సెన్సెక్స్ 637.49 పాయింట్లు లేదా 2.03% 32,008.61 పాయింట్ల వద్ద ముగిసింది. 

ఈ రోజు, ట్రేడింగ్ సెషన్‌లో దాదాపు 1633 షేర్లు లాభాలను నమోదు చేయగా, 723 షేర్లు నష్టాలను నమోదు చేశాయి మరియు 169 షేర్లు స్థిరంగా ఉన్నాయి. విస్తృత మార్కెట్ ర్యాలీ బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ సూచికలు, వరుసగా 1.49 శాతం మరియు 1.97 శాతం లాభాలను ఆర్జించాయి.

నేటి ట్రేడింగ్ సెషన్‌లో బిఎస్‌ఇ క్యాపిటల్ గూడ్స్ సూచి 5.08 శాతం లాభాలను నమోదు చేసిన అతిపెద్ద రంగాల లాభదాయినిగా నిలిచింది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ 23.67 శాతం పెరగగా, భారత్ ఎలక్ట్రానిక్స్ 8.42 శాతం పెరిగి రూ. 65.70 వద్ద ముగిసింది. ఫార్మా, ఎఫ్‌ఎంసిజి కాకుండా ఇతర రంగాలలో, సూచీలు, సానుకూలంగా బలాన్ని పుంజుకున్నాయి. ఐటి, ఆటో, మెటల్, కెమికల్స్, మైనింగ్, ఇన్‌ఫ్రా, ఎనర్జీతో పాటు బ్యాంక్ నిఫ్టీ 4 శాతానికి పైగా లాభాలను ఆర్జించింది.

ప్రాథమికంగా, తన హక్కుల జారీ కొరకు మరియు 10 లక్షల కోట్ల మార్కెట్ పెట్టుబడి సమీకరించిన దాని కొరకు చాలా కాలంగా నోటీసు పరిశీలిస్తున్న ఆర్‌ఐఎల్ షేర్ ధర, ఈరోజు మార్కెట్ మనోభావాలను అంతగా ఉత్సాహపరచలేకపోయింది మరియు రూ. 13.25 లేదా 0.90% పెరిగి రూ. 1,492.50 వద్ద ముగిస్తింది.

ఈ స్టాక్స్ బుధవారం, మే 13న పునఃప్రారంభమయినప్పుడు సూచీలపై ప్రభావం చూపాయి. 

  • అవస్థాపనకు స్థిరత్వం చేకూరగలిగింది 

ఇన్ఫ్రా స్టాక్స్, ట్రేడింగ్ ప్రయోజనాల కోసం స్టాక్ మార్కెట్ ముగిసేవరకు స్థిరత్వాన్ని నిర్వహించగలిగాయి. లార్సెన్ & టౌబ్రో లిమిటెడ్ నిఫ్టీలోని ప్రధాన ఇన్ఫ్రా బ్రాండ్లలో ఒకటి, ఇది బుధవారం దాని పనితీరు ద్వారా అధిక లాభానికి దారితీసింది. ఎల్ అండ్ టి షేర్ ధర రూ. 51.20 లేదా 6.28%  పెరిగి, రూ. 866.00 వద్ద ముగిసింది.

  •  బ్యాంకింగ్ స్టాక్స్ యొక్క పునరుత్థానం 

బ్యాంక్ నిఫ్టీ 772.10 పాయింట్లు పెరిగి 19634.95 పాయింట్ల వద్ద ముగిసింది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న 12 అతిపెద్ద క్యాపిటలైజ్డ్ స్టాక్‌లను సూచించే బ్యాంక్ నిఫ్టీ, భారతీయ బ్యాంకింగ్ రంగం యొక్క అద్భుతమైన పనితీరును చిత్రీకరించింది, ఇది ప్రధానంగా యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ మరియు ఐసిఐసిఐ బ్యాంక్ వంటి స్టాక్‌లను కలిగి ఉంది. ప్రైవేటు రంగ యాక్సిస్ బ్యాంక్ రూ. 27.10 లేదా 7.01% పెరిగి రూ. 413.95 వద్ద ముగిసి ప్రముఖంగా నిలిచింది. ఇంట్రాడే పెట్టుబడిదార్లకు కూడా, ఈ స్టాక్ లాభాలను ఆర్జించింది. ఇది తక్కువగా అంటే, రూ. 399.60 లతో ప్రారంభమైంది మరియు అత్యధికంగా రూ. 416,45ల అధిక ధరను నమోదు చేసింది. అంతేకాకుండా, ఐసిఐసిఐ బ్యాంక్ కూడా సానుకూల సంకేతాలను చూపించింది, ఇది రూ. 16.00 లేదా 4.98%. పెరిగి, రూ. 337.20ల వద్ద ముగిసింది.