3-రోజుల వరుస నష్టాల తరువాత ఎగబాకిన మార్కెట్లు

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

భారతీయ మార్కెట్లు, ఈ రోజు, నిఫ్టీ, సెన్సెక్స్ 3 రోజుల నష్టాలను అధిగమించిన తరువాత సానుకూలంగా ముగిశాయి. ఒకవైపు, నిఫ్టీ 0.63% లేదా 55.85 పాయింట్లు పెరిగి 8879.10 వద్ద ముగియగా, మరోవైపు సెన్సెక్స్ 0.56% లేదా 167.19 పాయింట్లు పెరిగి 30196.17 వద్ద ముగిసింది. భారతి ఎయిర్‌టెల్ 11% పెరుగుదలతో నిఫ్టీలో అగ్రస్థానంలో నిలిచింది.

అగ్ర లాభపరులు మరియు నష్టపరులు

11 రంగాల మాపనాలలో ఆరు రంగాలు ఐటి, మెటల్, ఎఫ్‌ఎంసిజి, మరియు ఆటోలు నిఫ్టీలో 0.75 నుండి 1.2 శాతం మధ్య పెరుగుదలను చూపించాయి. భారతీ ఎయిర్‌టెల్ యొక్క స్టాక్ 11% పెరిగి, మార్కెట్ ధర రూ. 596,20 వద్ద ముగిసింది. ఐటిసి 3.64 శాతం పెరిగి రూ. 170.75 వద్ద ముగిసింది, పవర్ గ్రిడ్ 2.33 శాతం పెరిగి రూ. 158.10 వద్ద ముగిసింది, జెఎస్‌డబ్ల్యు స్టీల్ (3.83%), ఒఎన్‌జిసి (5.69%), అదానీ పోర్ట్స్ (9%) , అల్ట్రాటెక్ సిమెంట్ (4.15%), మరియు ఎన్‌టిపిసి (2.19%) వద్ద ముగిసాయి.

ఈ రోజు నిఫ్టీ మార్కెట్లో నష్టపోయిన వారిలో వేదాంత, రిలయన్స్ ఇండస్ట్రీస్, లార్సెన్ & టూబ్రో, సిప్లా, యాక్సిస్ బ్యాంక్, హెచ్‌యుఎల్, ఎస్‌బిఐ మరియు యుపిఎల్ ఉన్నాయి. సానుకూలంగా ప్రారంభమైన సెన్సెక్స్, ప్రముఖ స్టాక్ రిలయన్స్ ఇండస్ట్రీస్, సెషన్ ముగిసే సమయానికి తన లాభాలను వదులుకుంది మరియు 2.26 శాతం తగ్గి 1,408.15 వద్ద తక్కువగా ముగిసింది. ఈ సంస్థ తన రైట్స్ ఇష్యూను బుధవారం ప్రారంభించింది. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ 0.59 శాతం తగ్గి 831.50 రూపాయల వద్ద ముగియగా, ఎఫ్‌ఎంసిజి బెహెమోత్ హిందుస్తాన్ యూనిలీవర్ 1.56 శాతం తగ్గి 1974.50 రూపాయల వద్ద ముగిసింది.

పెరుగుదలకు దోహదపడిన టెలికామ్ రంగం

కోవిడ్-19 కారణంగా దేశం మొత్తం లాక్ డౌన్ పరిస్థితిలో ఉంది. ప్రజలు వారి ఇళ్లలో మరియు మొబైల్ పరికరాల్లో చిక్కుకు పోయారు మరియు డేటా ప్లాన్స్ వారి సంరక్షణకు ఉపయోగపడుతున్నాయి. మొబైల్ టారిఫ్‌లు మరియు డేటా ప్లాన్‌ల కోసం పెరిగిన వ్యయం అనేది టెలికామ్ రంగం యొక్క సగటు ఆదాయాన్ని పెరగడానికి దారితీసింది, దాని సగటు ఆదాయం, ఒక్కొక్క వినియోగదారుకు 25% గా పెరిగింది.

మార్కెట్ మనోభావాలపై లాక్ డౌన్ పొడిగింపు ప్రభావం

పెరుగుతున్న కోవిడ్-19 కేసులను పరిష్కరించడానికి లాక్ డౌన్ పొడిగింపు ప్రకటన మార్కెట్ పరిస్థితిని మరింత దిగజార్చింది. ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీపై పెట్టుబడిదారులు కూడా నిరాశ చెంది, పతనాన్ని ఆశిస్తున్నారు. దీని ఫలితంగా, బ్యాంకులు మరియు ఎన్‌బిఎఫ్‌సి బాగా పడిపోయాయి. నిఫ్టీ పిఎస్‌యు బ్యాంక్ సూచీ తీవ్రంగా దెబ్బతింది మరియు 2.6% పతనాన్ని చవిచూసింది.

సంభావ్య కోవిడ్-19 వ్యాక్సిన్ వైద్య ప్రయోగాలు ప్రపంచ మార్కెట్లను ప్రభావితం చేశాయి

అమెరికాలోని వ్యాక్సిన్ ప్రయోగాల పట్ల ప్రపంచ మార్కెట్లు మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి, దీనితో, నాస్డాక్ 2.44% లేదా 220.27 పాయింట్ల పెరుగుదలను, నిక్కీ 225, 1.49% లేదా 299.72 పాయింట్ల పెరుగుదలను, హాంగ్ సెంగ్ 1.89% లేదా 453.36 పాయింట్ల పెరుగుదలను ప్రదర్శించాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల ధోరణి భారత మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపింది. బలహీనపడిన డాలర్ సూచిక మార్కెట్ పనితీరుపై మరింత సానుకూల ప్రభావాన్ని చూపింది. అయినా కూడా, ఈ ప్రయోగాలన్నీ ఇంకా ప్రారంభ దశలో ఉన్నందున పెరుగుదల అనేది తాత్కాలికం కావచ్చు మరియు వైరస్ కు సంబంధించిన ఆందోళనలు భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి.