కరోనా పోరుకు మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ 51కోట్ల విరాళం

తెలంగాణకు 3కోట్లు.. ఆంధ్రకు కోటి*

హైదరాబాద్: ప్రస్తుతం భారత్‌లో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటికే దేశంలో కరోనా కేసులు 1000 మార్కును దాటేశాయి. ఈ క్రమంలో కరోనాపై పోరుకు ఆర్థిక సాయం కావాలని దేశ ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విరాళాలు సమీకరిచడానికి నిర్ణయించుకున్నాయి. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో కరోనాపై పోరుకు తమ వంతుగా 51కోట్లు విరాళం అందజేస్తున్నట్లు మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ ప్రకటించింది. ఈ సొమ్మును ఆయా రాష్ట్రాల్లోని సీఎం సహాయనిధికి అందజేస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో రూ.3కోట్లు తెలంగాణ ప్రభుత్వానికి, రూ. కోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయించినట్లు సమాచారం. అంతేగాక కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు వెంటిలేటర్లు, వ్యక్తిగత భద్రతకు అవసరమైన ఉత్పత్తులను సరఫరా చేస్తామని, దీనికోసం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని మ్యాన్‌కైండ్ ఫార్మా సంస్థ చైర్మన్ ఆర్‌సీ జునేజా తెలిపారు.

దీనికోసం తెలంగాణ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బిహార్, తమిళనాడు, ఢిల్లీ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్, ఒడిశా రాష్ట్రాల ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ చర్యల గురించి జునేజా మాట్లాడుతూ.. ‘దేశం అత్యంత విపత్కర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఇటువంటి సమయంలో కరోనాపై పోరాడే బాధ్యతను అందరూ పంచుకోవడమే ముఖ్యం. అందుకే ఈ పోరాటాన్ని ముందుండి నడిపిస్తున్న ఆరోగ్యసిబ్బందికి అన్నిరకాల సహాయమూ అందించాలని నిర్ణయించుకున్నాం. ఈ విపత్కర పరిస్థితుల్లో పేషెంట్లకు చికిత్స అందించగలిగే ఆస్పత్రులకు సాధ్యమైనంత సహకారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ విరాళం ప్రకటించాం’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *