మరిన్ని పట్టణాలకు జియో ఫైబర్‌ సేవలు

వినియోగదారులకు హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జియో ఫైబర్‌ స్పష్టం చేసింది. హైదరాబాద్‌, తెలంగాణలోని ముఖ్య నగరాల్లో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌తో ఉత్తమ సేవలను అందించడంతోపాటు కవరేజీని పెంచుతున్నట్లు తెలిపింది. లాక్‌డౌన్‌తో అనేక మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తున్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండ తదితర పట్టణాల్లో ఇంటి నుంచి పని చేస్తున్నవారికి హై స్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ను అందించడం ద్వారా మద్దతుగా నిలవాలని కంపెనీ భావిస్తోందని జియోఫైబర్‌ తెలిపింది. ప్రస్తుతం ఈ సేవలు అందుబాటులో ఉన్న పట్టణాలతో పాటు ఇతర ప్రధాన పట్టణాలకు ఈ సేవలను విస్తరిస్తున్నట్లు పేర్కొంది. 100 ఎంబీపీఎస్‌ నుంచి 1జీబీపీఎస్‌ వరకూ వేగంతో హైస్పీడ్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను అందిస్తున్నట్లు వివరించింది. లాక్‌డౌన్‌లో స్టే కనెక్ట్‌, స్టే ప్రొడక్టివిటీ ఆఫర్‌ ద్వారా ఖాతాదారులకు డబుల్‌ డేటా ప్రయోజనాన్ని కల్పిస్తున్నట్లు తెలిపింది.