ప్ర‌ముఖ సినీన‌టుడు జీవా తో #బ్రేకింగ్‌న్యూస్ డిజిట‌ల్ ప్ర‌చారాన్ని ప్రారంభించిన‌ రాయ‌ల్ సుంద‌రం

డిస్నీ హాట్‌స్టార్‌లో #ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్ 2021) అభిమానులను అల‌రించేందుకు కొత్త కార్య‌క్ర‌మం

రాయ‌ల్ సుంద‌రం జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్, భార‌త‌దేశంలో మొట్ట‌మొద‌టి ప్రైవేట్ రంగ జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ, #బ్రేకింగ్ న్యూస్ ప్ర‌చారం #క్లిక్‌టిక్‌డ‌న్ (#ClickTickDone) నేడు ప్రారంభించింది. ప్ర‌ముఖ హీరో జీవా న‌టిస్తున్న ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మం డిస్నీ హాట్‌స్టార్‌లో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 14వ ఎడిష‌న్ సంద‌ర్భంగా ప్ర‌చారం కానుంది. 15 సెక‌న్ల ఈ ప్ర‌చార కార్య‌క్ర‌మంలో ఐదు భార‌తీయ భాష‌లు ( ఇంగ్లిష్‌, హిందీ , త‌మిళ్, తెలుగు మ‌రియు క‌న్న‌డ)ల‌లో ప్ర‌సారం కానుంది. ఈ డిజిట‌ల్ ప్రచారం ఏప్రిల్ 12వ తేదీ నుంచి మే 30, 2021 వ‌ర‌కు కొన‌సాగ‌నుంది.

రాయ‌ల్ సుంద‌రం జ‌న‌ర‌ల్ ఇన్సురెన్స్ కంపెనీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ ఎంఎస్ శ్రీ‌ధ‌ర్ ఈ ప్రచారం గురించి స్పందిస్తూ “భార‌త‌దేశంలో అభిమానులు అత్యంత వీక్షించే వాటిల్లో ఐపీఎల్ ఒక‌టి. రాయ‌ల్ సుంద‌రం ఇన్సురెన్స్ కంపెనీ యొక్క ఉత్పాద‌న‌ల ప్ర‌యోజ‌నాల‌ను ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేసేందుకు ఇది స‌రైన స‌మ‌యం. బీమా రంగంలోని వివిధ ర‌కాల నిబంధ‌న‌ల‌ గురించి తెలియ‌జేయ‌డం మ‌రియు బీమా ప్ర‌యోజ‌నాలు ప్ర‌జ‌ల‌కు అర్థ‌మ‌య్యేలా వివ‌రించాల‌ని ల‌క్ష్యంగా నిర్దేశించుకున్నాం. స్వ‌ల్ప వ్యవధి క‌లిగిన మ‌రియు స్ప‌ష్టంగా వివ‌రాల‌ను తెలియ‌జేసే వీడియోల‌ను రూపొందించి బ్రేకింగ్ న్యూస్ రూపంలో వినూత్నంగా ప్ర‌జ‌ల‌కు చేరవేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాం. ఇంగ్లిష్‌తో పాటుగా ప్రాంతీయ భాష‌లైన‌ హిందీ, త‌మిళం , తెలుగు మ‌రియు క‌న్న‌డ‌లో ఈ ప్ర‌చారం జ‌ర‌గ‌నుంది. హాట్‌స్టార్‌లో ఐపీఎల్ 2021 సీజ‌న్‌లో ఈ వీడియోలు ప్ర‌ద‌ర్శించ‌బ‌డ‌నున్నాయి.“ అని వెల్ల‌డించారు.