ఇన్ఫినిక్స్ మొబైల్ కంపెనీ మంగళవారం భారత మార్కెట్లోకి కొత్త ఇనిఫినిక్స్ ఎస్5ను విడుదల చేసింది. దీని ధరను రూ.8,999గా నిర్ణయించింది. 6.6 అంగుళాల హెచ్డి డిస్ప్లే కలిగిన ఈ స్మార్ట్ఫోన్ను వెనుకాల మూడు కెమెరాలతో అందుబాటులోకి తెచ్చింది. 16 ఎంపి, 1.8 ఎంపి, 2ఎంపి కెమెరాలను అమర్చింది. మెరుగైన సెల్ఫీ కోసం 32 ఎంపి, 2.0 కెమెరాను పొందుపర్చింది. 4000 ఎంఎహెచ్ బ్యాటరీ, 4జి ర్యామ్, 64 రోమ్ , 3డి గ్లాస్ డిజైన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
