రూ.10 వేల లోపే రెండు ఫోన్లు లాంచ్ చేసిన ఇన్‌ఫీనిక్స్

మొబైల్స్ త‌యారీదారు ఇన్ఫినిక్స్‌.. హాట్ 9, హాట్ 9 ప్రొ పేరిట రెండు నూత‌న స్మార్ట్‌ఫోన్ల‌ను భార‌త్‌లో విడుద‌ల చేసింది. వీటిలో 6.6 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన పంచ్ హోల్ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 8 మెగాపిక్స‌ల్ పంచ్ హోల్ కెమెరా ఉంటుంది. వీటిలో మీడియాటెక్ హీలియో పి22 ప్రాసెస‌ర్‌, 4జీబీ ర్యామ్‌ల‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ 10 ఓఎస్ ఆధారంగా ఇవి ప‌నిచేస్తాయి. హాట్ 9 ఫోన్ వెనుక భాగంలో 13 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయ‌గా.. హాట్ 9 ప్రొ వెనుక భాగంలో 48 మెగాపిక్స‌ల్ మెయిన్ కెమెరాను అమ‌ర్చారు. ఇక రెండింటికీ వెనుక భాగంలో అద‌నంగా 2 మెగాపిక్స‌ల్ కెపాసిటీ క‌లిగిన రెండు వేర్వేరు కెమెరాల‌ను అమర్చారు. ఈ ఫోన్ల‌కు వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఇవి డెడికేటెడ్ డ్యుయ‌ల్ సిమ్‌, మైక్రో ఎస్‌డీ కార్డు స్లాట్ల‌ను క‌లిగి ఉన్నాయి. 5000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీల‌ను వీటిలో ఏర్పాటు చేశారు.